రిజ్వాన్‌, దక్షిణాఫ్రికా బౌలర్‌ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్‌ | Muhammad Rizwan And Marco Jansen Get Involved Into Heated Verbal Spat During PAK Vs SA Clash, Video Viral - Sakshi
Sakshi News home page

WC 2023 PAK Vs SA: రిజ్వాన్‌, దక్షిణాఫ్రికా బౌలర్‌ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్‌

Published Fri, Oct 27 2023 4:40 PM

Rizwan and Marco Jansen Engage In Verbal Spat During  - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌ కీలక మ్యాచ్‌లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.  అయితే పవర్‌ప్లే లోపే ఓపెనర్లు షఫీక్‌, ఇమామ్‌ ఉల్‌-హాక్‌ వికెట్లను పాక్‌ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో పాక్‌ స్టార్‌ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్‌ స్టార్‌ మార్కో జానెసన్‌ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. 

ఏం జరిగిందంటే?
ఇమామ్‌ ఉల్‌-హాక్‌ ఔటైన తర్వాత మహ్మద్‌ రిజ్వాన్‌ క్రీజులోకి వచ్చాడు. అయితే జానెసన్‌ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్‌ తప్పించుకున్నాడు. రిటర్న్‌ క్యాచ్‌ను అందుకోవడంలో జానెసన్‌ విఫలమయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్‌ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్‌ రిజ్వాన్‌ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు.

అందుకు బదులుగా రిజ్వాన్‌ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో బాబర్‌ ఆజం, ఫీల్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్‌ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా..

Advertisement
 
Advertisement
 
Advertisement