అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది : పాంటింగ్‌

Ricky Ponting Says Surprise To Me About Wriddhiman Saha Performance - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్సపై భారీ విజయం సాధించింది. 88 పరుగుల భారీ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వృద్దిమాన్‌ సాహా 87 పరుగులతో జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్‌ వార్నర్‌ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఢిల్లీకి వరుసగా ఇది హ్యాట్రిక్‌ ఓటమి. ఈ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్ప్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ సాహా ప్రదర్శనపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపాడు. వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన వృద్దిమాన్‌ సాహా నాకౌట్‌ ఇన్నింగ్స్‌తో విజయానికి దూరం కావాల్సి వచ్చిందంటూ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.

'ఈరోజు సాహా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిని ముందే తెలుసు.. కానీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం నుంచి జట్టుతో ఉంటున్న తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి తుఫాను ఇన్నింగ్స్‌ ఆడేశాడు. అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్‌స్టో రానున్న మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రావడం కష్టమే.. ఒకవేళ  ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో.

ఎస్‌ఆర్‌హెచ్‌ విధించిన 220 పరుగులు చేధించడం కొంచెం కష్టమే. శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానేలు ఓపెనర్లుగా వచ్చినా.. ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ సున్నాకే వెనుదిరగడం.. మిగతావారు పూర్తిగా విఫలం కావడం.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. అయినా సాహా, వార్నర్‌ దాటికి పవర్‌ప్లేలో ఆ జట్టు ఈ లీగ్‌లోనే అత్యధికంగా 77 పరుగులు చేయడంతో విజయానికి అక్కడే దూరమయ్యామని అనిపించాం. ఆరంభం నుంచి ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సులువుగా ప్లేఆఫ్‌ చేరొచ్చనే విషయంపై స్పష్టంగానే ఉన్నాం.

ఒక దశలో ఏడు విజయాలు సాధించిన తర్వాత వరుసగా హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేయడంతో టాప్‌ ప్లేస్‌ కోసం మళ్లీ పోటీ ఏర్పడింది. ఇప్పుడు దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది. మాకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో కఠినమైన ముంబై, ఆర్‌సీబీని ఎదుర్కోనున్నాం. రెండు మ్యాచ్‌లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం.. రెండు గెలిస్తే  టాప్‌ ప్లేస్‌ మా సొంతం అవుతుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే.. రన్‌రేట్‌ కీలకమవుతుంది.. అందుకే రానున్న మ్యాచ్‌ల్లో రన్‌రేట్‌ను కూడా మరింత మెరుగుపరుచుకుంటాం.' అని పాంటింగ్‌ తెలిపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 11:05 IST
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్‌ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో...
04-04-2021
Apr 04, 2021, 19:54 IST
ముంబై: ఐపీఎల్‌-14వ సీజన్‌ ఇంకా మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం...
31-01-2021
Jan 31, 2021, 01:31 IST
ముంబై: ఐపీఎల్‌–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌...
05-01-2021
Jan 05, 2021, 14:47 IST
ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించారు.
21-12-2020
Dec 21, 2020, 14:23 IST
మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ...
23-11-2020
Nov 23, 2020, 14:53 IST
ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి...
19-11-2020
Nov 19, 2020, 17:11 IST
టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు.
17-11-2020
Nov 17, 2020, 18:58 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌...
15-11-2020
Nov 15, 2020, 19:37 IST
రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ...
12-11-2020
Nov 12, 2020, 20:06 IST
టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.
12-11-2020
Nov 12, 2020, 05:02 IST
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా...
11-11-2020
Nov 11, 2020, 12:25 IST
అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు.
11-11-2020
Nov 11, 2020, 10:26 IST
బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా...
11-11-2020
Nov 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
11-11-2020
Nov 11, 2020, 04:26 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు...
10-11-2020
Nov 10, 2020, 22:55 IST
దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు...
10-11-2020
Nov 10, 2020, 21:19 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది....
10-11-2020
Nov 10, 2020, 19:59 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌ తొలి...
10-11-2020
Nov 10, 2020, 19:10 IST
దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై...
10-11-2020
Nov 10, 2020, 18:24 IST
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top