రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు! | Ravindra Jadeja Says Pink Looking Good After Match Won Vs CSK | Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

Mar 31 2026 11:05 AM | Updated on Mar 31 2026 12:34 PM

Ravindra Jadeja Says Pink Looking Good After Match Won Vs CSK

Courtesy: IPL 2026

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా ఐపీఎల్‌లో 17 ఏళ్ల త‌ర్వాత త‌న సొంత గూటికి చేరాడు. త‌న‌ను వెలుగులోకి తీసుకొచ్చిన‌ రాజస్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమ‌వారం సీఎస్‌కేతో జ‌రిగిన సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనే జ‌డేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే త‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. 

మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన జ‌డేజా 4 ఓవ‌ర్ల‌లో 18 ప‌రుగులిచ్చి 2 వికెట్లు ప‌డగొట్టాడు. రాజ‌స్తాన్ మ్యాచ్ గెల‌వ‌డంలో త‌న వంతు పాత్ర‌ను స‌మ‌ర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్‌కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. 

ముఖ్యంగా సీఎస్‌కే ఆల్‌రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్‌కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. 

అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్‌) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 

128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్‌, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్‌తో పని సులువు చేశారు. లోస్కోరింగ్‌, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్‌లోనూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. 

ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్‌కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్‌కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. 

తాజాగా 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్‌కే జడేజాను రాజస్తాన్‌కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్‌కే జ‌ట్టులో జ‌డేజా స‌భ్యుడిగా ఉన్నాడు.

జ‌డ్డూ ఎమెష‌న‌ల్‌
2012 నుంచి 2025 వ‌ర‌కు సీఎస్‌కే జ‌ట్టులో కొన‌సాగిన ర‌వీంద్ర జ‌డేజా సోమ‌వారం మ్యాచ్‌లో భాగంగా సీఎస్‌కే ఇన్నింగ్స్ స‌మ‌యంలో ఎమెష‌న‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది. 9వ ఓవ‌ర్లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద నిల‌బ‌డిన జ‌డేజాను చూస్తూ అభిమానులు సీఎస్‌కే.. సీఎస్‌కే అంటూ అర‌వ‌డం క‌నిపించింది. 

ఇదే స‌మ‌యంలో కెమెరాలు జ‌డేజా వైపు తిప్ప‌గా, జ‌డ్డూ ఉబికి వ‌స్తున్న దుఃఖాన్ని ఆపుకున్న‌ట్లుగా క‌నిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జ‌డేజా సీఎస్‌కే వ‌దిలి వెళ్లిన‌ప్ప‌టికీ త‌మ మ‌నసులో మాత్రం ఎప్ప‌టికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్‌గా జడేజా ఐపీఎల్‌లో 255 మ్యాచ్‌లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement