'ఆ నెంబర్‌ మరిచిపోలేదు.. అందుకే స్పందించాడు'

Ravindra Jadeja Introduce His 22 Acres Entertainer Michael Vaughan Reacts - Sakshi

ఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్‌ మీడియాలోనూ అంతే చురుగ్గా కనిపిస్తాడు. తాజాగా తనకిష్టమైన గుర్రంతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా 22 ఎకరాలు ఎంటర్‌టైనర్‌ ఇదే.. ఇది నా బెస్ట్‌ ఫ్రెండ్‌.. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. నా జీవితాంతం ఆ బంధం అలాగే కొనసాగుతుంది. అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

అయితే జడేజా పెట్టిన పోస్టుపై నెటిజన్లు బాగానే స్పందించగా.. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ కూడా స్పందించడం విశేషం. జడేజా షేర్‌ చేసిన ఫోటోను లైక్‌ చేసి మూడు హార్ట్‌ ఎమోజీలను పెట్టాడు. అయితే వాన్‌ జడేజా పోస్టుపై స్పందించడానికి ఒక కారణం ఉందని అతను 22 అనే పదం ఇంకా మరిచిపోలేదని .. అందుకే జడేజా పోస్టెపై స్పందించాడంటూ కామోంట్లు చేశారు.

కాగా మైకెల్‌ వాన్‌ ఇంగ్లండ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఎదో ఒక దానిపై విమర్శలు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి రెండు టెస్టులకు వాన్‌ చేసిన అతి ఎవరు మరిచిపోరు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు డై నైట్‌ పద్దతిలో నిర్వహించగా.. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం చవిచూసింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నాలుగో టెస్టుకు 22 గజాల పిచ్‌ను ఎలా రూపొందిస్తున్నారో చూడండి అంటూ రకరకాల పోస్టులతో రెచ్చిపోయాడు. ఒకసారి పొలం దున్నుతూ పిచ్‌ను తయారు చేస్తున్నట్లుగా.. మరొకసారి అదే పిచ్‌పై బ్యాటింగ్‌ ఎలా ఉండబోతుందో వివరించాడు. వాన్‌ చేసిన అతికి అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఈ సిరీస్‌లో టీమిండియా చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మినహా మిగిలిన వాటిని గెలిచి 3-1తేడాతో సిరీస్‌ గెలుచుకుంది. కాగా జడేజా ఆసీస్‌ పర్యటనలో గాయపడడంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆడిన జడేజా ఇటీవలే డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి జడేజా ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను ఆరంభించాడు.

చదవండి:
'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్‌ సూపర్‌'

మొటేరా పిచ్‌ ఎలా తయారవుతుందో చూడండి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top