జడేజా సూపర్‌ డెలివరీ.. దెబ్బకు స్మిత్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌ | Ravindra Jadeja bowls exceptional delivery to send Steve Smith packing | Sakshi
Sakshi News home page

IND vs AUS: జడేజా సూపర్‌ డెలివరీ.. దెబ్బకు స్మిత్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Oct 8 2023 6:15 PM | Updated on Oct 9 2023 10:40 AM

Ravindra Jadeja bowls exceptional delivery to send Steve Smith packing - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు.

తన 10 ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా ఆసీస్‌  బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను జడేజా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఫాస్ట్‌ బౌలర్లను మెరుగ్గా ఆడుతూ స్మిత్‌ క్రీజులో పాతుకుపోయాడు.

ఈ క్రమంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బంతిని జడేజా చేతికి ఇచ్చాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 28 ఓవర్‌లో జడ్డూ వేసిన తొలి బంతికి స్మిత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మిడిల్‌ పడిన బంతి అనుహ్యంగా టర్న్‌ అయ్యి హాఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

జడ్డూ దెబ్బకు స్మిత్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది.  భారత బౌలర్ల దాటికి 199 పరుగులకు ఆలౌటైంది.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు సిరాజ్‌, అశ్విన్‌, హార్దిక్‌ చెరో వికెట్‌ సాధించారు. ఆసీస్‌ బ్యాటర్లలో స్టీవ్‌ స్మిత్‌(46) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండిహార్దిక్‌ కాదు! ధోని మాదిరి ప్రభావం చూపగల బ్యాటర్‌ అతడే: సురేశ్‌ రైనా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement