Ranji Trophy: నాకౌట్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదిక ఖరారు! ఫైనల్ ఎప్పుడంటే!

Ranji Trophy 2022- ముంబై: దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ నాకౌట్ దశ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను, వేదికను ప్రకటించారు. జూన్ 4 నుంచి 24 వరకు జరిగే రంజీ నాకౌట్ మ్యాచ్‌లకు బెంగళూరు ఆతిథ్యమివ్వనుంది. జూన్ 4 నుంచి 8 వరకు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బెంగాల్‌తో జార్ఖండ్... ముంబైతో ఉత్తరాఖండ్... కర్ణాటకతో ఉత్తరప్రదేశ్... పంజాబ్‌తో మధ్యప్రదేశ్ తలపడతాయి.
అనంతరం జూన్ 12 నుంచి 16 వరకు రెండు సెమీఫైనల్స్‌ను నిర్వహిస్తారు. జూన్ 20 నుంచి 24 వరకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందే రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగిసిన విషయం తెలిసిందే.
చదవండి👉🏾 IPL 2022: కోల్‌కతా... అదే కథ
మరిన్ని వార్తలు