సింధు శుభారంభం | PV Sindhu makes a good start in Syed Modi International World Tour | Sakshi
Sakshi News home page

సింధు శుభారంభం

Nov 28 2024 4:08 AM | Updated on Nov 28 2024 4:08 AM

PV Sindhu makes a good start in Syed Modi International World Tour

లక్నో: సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సింధు 21–17, 21–15తో భారత రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

భారత్‌కే చెందిన వలిశెట్టి శ్రేయాన్షి, మాళవిక బన్సోద్, రక్షిత శ్రీ, అనుపమ ఉపాధ్యాయ్, తస్నిమ్‌ మీర్, ఉన్నతి హుడా, దేవిక సిహాగ్, ఐరా శర్మ కూడా తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడా కారులు, టాప్‌ సీడ్‌ లక్ష్య సేన్‌... రెండో సీడ్‌ ప్రియాన్షు రజావత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. 

తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌ 21–12, 21–12తో ఆదిల్‌ (మలేసియా)పై, ప్రియాన్షు 21–13, 21–12తో కార్తికేయ (భారత్‌)పై గెలిచారు. భారత్‌కే చెందిన మైస్నం మెరాబా, కిరణ్‌ జార్జి, ఆయుశ్‌ శెట్టి, రిత్విక్‌ కూడా తొలి రౌండ్‌లో తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement