Pullela Gopichand: భారత బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడిగా పుల్లెల గోపీచంద్

జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ‘బాయ్’ సాధారణ సర్వ సభ్య సమావేశంలో హిమంత బిశ్వశర్మను మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
2026 వరకు కొనసాగనున్న ఈ నూతన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది సంయుక్త కార్యదర్శలు, ఎనిమిది మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. జనరల్ సెక్రటరీగా సంజయ్ మిశ్రా, కోశాధికారిగా హనుమాన్‌దాస్ లఖాని ఎన్నికయ్యారు.
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ఆడుతున్న తెలుగు ఆటగాళ్లు ఎవరో తెలుసా?