నేను మోసపోయాను.. పృథ్వీ షా కాబోయే భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్ | Prithvi Shaws Fiancees Alleged Cryptic Post Viral | Sakshi
Sakshi News home page

నేను మోసపోయాను.. పృథ్వీ షా కాబోయే భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Jul 5 2026 7:12 PM | Updated on Sep 25 2026 6:11 PM

Prithvi Shaws Fiancees Alleged Cryptic Post Viral

టీమిండియా ఆట‌గాడు పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి కాబోయో భార్య, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పోస్ట్‌లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. "నన్ను చాలాసార్లు మోసం చేశాడు. అయినా నేను ఒక్క మాట కూడా అనలేదు. 

జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆకృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా మ‌రో పోస్ట్‌లో "సోషల్ మీడియాలో అతడి గురించి వచ్చే ప్రతి రూమర్ నిజమే" అంటూ పేర్కొంది. 

ఆ పోస్ట్‌లో ఆకృతి  ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ,అది పృథ్వీ షాను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లు పెట్టిన కొద్దిసేపటికే ఆమె వాటిని డిలీట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కాలేదు. నిశ్చితార్థం నాటి ఫోటోలు కూడా వారి ఖాతాల్లో ఉన్నాయి.

కాగా చాలా కాలంగా ప్రేమలో ఉన్న పృథ్వీ షా ,ఆకృతి అగర్వాల్ ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పృథ్వీ కెరీర్ విషయానికి వస్తే.. ఐపీఎల్‌-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికి ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా లభించలేదు. అతడు ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement