breaking news
akriti agarwal
-
పృథ్వీ షా పెళ్లి క్యాన్సిల్ షాకిచ్చిన ప్రేయసి..
-
మా దారులు వేరయ్యాయి: భారత క్రికెటర్ పెళ్లి రద్దు
భారత క్రికెటర్ పృథ్వీ షా వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తన చిరకాల ప్రేయసితో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఈ ఏడాది మార్చిలో ఫొటోలు పంచుకున్నాడు పృథ్వీ షా.మా దారులు వేరయ్యాయిఈ నేపథ్యంలో ఇక పెళ్లే తరువాయి అనుకున్న తరుణంలో ఆకృతి అగర్వాల్ ఊహించని షాకిచ్చింది. తమ వివాహం రద్దైపోయిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘మా దారులు వేరయ్యాయి. మా లక్ష్యాలు వేరు. పరిస్థితులు వేరు.అందుకే నేను, నా కాబోయే భర్త కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాను.మా భవిష్యత్తు గురించి ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాము. మేము ఒకరి పట్ల ఒకరం ఎంతో ప్రేమను కలిగి ఉన్నాము. ఒకరి గురించి మరొకరం ఎంతగానో ఆలోచించేవాళ్లము. అయితే, మా దారులు వేరని.. కాబట్టి కలిసి జీవించడం కుదరని తెలిసివచ్చింది.దయచేసి అసత్యాలు ప్రచారం చేయకండిమాకున్న బాధ్యతలు, ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా ఇద్దరం కలిసే విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాము. భవిష్యత్తు ఉత్తమంగా, శాంతితో కూడి ఉండాలని.. ఇద్దరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఇలాంటి కష్టమైన తరుణంలో ప్రతి ఒక్కరు మా గోప్యతను గౌరవించి.. మేము విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ చిలువలు పలువలు చేసి వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లు రాయకండి. ధన్యవాదాలు’’ అని ఆకృతి పేర్కొంది. అయితే, పృథ్వీ షా మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎలాంటి పోస్టు పెట్టలేదు.ఎవరీ ఆకృతి?ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆకృతి అగర్వాల్ స్వస్థలం. నటిగా ఎదుగుతున్న 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా!. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చిన ఆమె మోడలింగ్ చేసింది. త్రిముఖ అనే సినిమాలో తొలిసారి నటించింది.గతేడాది ఓ రొమాంటిక్ రీల్ చేస్తూ పృథ్వీ షాతో తన బంధం గురించి సంకేతాలు ఇచ్చింది. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్‌ల పెళ్లికి పృథ్వీ షాతో జంటగా హాజరై తమ రిలేషన్‌షిప్‌ను బహిర్గతం చేసింది. ఆ తర్వాత వారం రోజుల్లోపే ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడిలా విడిపోతున్నామంటూ ఆకృతి షాకిచ్చింది.ఎత్తుపళ్లాల కెరీర్క్రికెటర్గా చిన్న వయసులోనే సత్తా చాటిన పృథ్వీ షా.. సారథిగా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించాడు. తద్వారా టీమిండియాలోకి దూసుకువచ్చి ఓపెనర్‌గా సత్తా చాటాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డ ఈ ముంబైకర్.. టీమిండియా నుంచి కనుమరుగైపోయాడు. క్రమశిక్షణారాహిత్యం కారణంగా అతడి కెరీర్ దెబ్బతింది. ఈ క్రమంలో దేశీక్రికెట్లో సత్తా చాటి కెరీర్ మెరుగుపరచుకునే క్రమంలో తాజాగా వ్యక్తిగత జీవితంలో ఇలా ఎదురుదెబ్బ తగిలింది.చదవండి: అతడితో ఎఫైర్.. ప్రెగ్నెంట్ అని చెప్తే ఓకే అన్నాడు.. ఆ తర్వాత.. -
నన్ను మోసం చేశాడు.. పృథ్వీ షా కాబోయే భార్య షాకింగ్ కామెంట్స్..
-
నేను మోసపోయాను.. పృథ్వీ షా కాబోయే భార్య ఇన్‌స్టా పోస్ట్ వైరల్
టీమిండియా ఆటగాడు పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడి కాబోయో భార్య, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకృతి అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పోస్ట్‌లు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. "నన్ను చాలాసార్లు మోసం చేశాడు. అయినా నేను ఒక్క మాట కూడా అనలేదు. జీవితంలో ఒక అడుగు ముందుకు వేసిన తర్వాత కూడా ఇలా జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని ఆకృతి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా మరో పోస్ట్‌లో "సోషల్ మీడియాలో అతడి గురించి వచ్చే ప్రతి రూమర్ నిజమే" అంటూ పేర్కొంది. ఆ పోస్ట్‌లో ఆకృతి ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ,అది పృథ్వీ షాను ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లు పెట్టిన కొద్దిసేపటికే ఆమె వాటిని డిలీట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కాలేదు. నిశ్చితార్థం నాటి ఫోటోలు కూడా వారి ఖాతాల్లో ఉన్నాయి.కాగా చాలా కాలంగా ప్రేమలో ఉన్న పృథ్వీ షా ,ఆకృతి అగర్వాల్ ఈ ఏడాది మార్చి 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక పృథ్వీ కెరీర్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్నప్పటికి ఒక్క మ్యాచ్‌లో ఆడే అవకాశం కూడా లభించలేదు. అతడు ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
‘పర్ఫెక్ట్ ఇన్నింగ్స్.. నిశ్చితార్థం చేసుకున్నా’
భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా శుభవార్త చెప్పాడు. మనసిచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించాడు. ఆకృతి అగర్వాల్‌తో తన ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.ఈ సందర్భంగా.. ‘‘మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితకాలం మైదానం వెలుపలా అదే జోరు కొనసాగించేలా.. ఆమే నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్.. జస్ట్ ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్నా’’ అని 26 ఏళ్ల పృథ్వీ షా ఇన్‌స్టా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఆకృతి ఎవరంటే?సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, నటిగా 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆకృతి.. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చింది.ఈ క్రమంలో నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. త్రిముఖ అనే చిత్రంలో మొదటిసారి నటించింది. ఇక పృథ్వీ షాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గతేడాది రొమాంటిక్ రీల్ చేయడం ద్వారా తమ బంధం గురించి వీరు అభిమానులకు సంకేతాలు ఇచ్చారు.ఇటీవల.. సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్‌ల వివాహానికి కూడా పృథ్వీ- ఆకృతి జంటగా హాజరయ్యారు. ఇంతలోనే.. వారం తిరగకముందే ఎంగేజ్మెంట్ చేసుకుని అభిమానులకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. పడిలేచిన ప్రయాణంచిన్న వయసులోనే క్రికెటర్‌గా సత్తా చాటిన పృథ్వీ షా.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. ఈ క్రమంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన ఈ ముంబైకర్.. ఓపెనర్‌గా ఆరంభంలో సత్తా చాటాడు.అయితే, ఆ తర్వాత ఫామ్ కొనసాగించలేక జట్టులో స్థానం కోల్పోయాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్ 19 వరల్డ్‌కప్ ఆడిన శుబ్‌మన్ గిల్ ఇపుడు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదగగా.. క్రమశిక్షణా రాహిత్యంతో పృథ్వీ షా అధఃపాతాళానికి పడిపోయాడు. ఇటీవలే మళ్లి ఫామ్ అందుకున్న అతడు.. ముంబై తరఫున దేశీ క్రికెట్లో రాణించాడు. ఐపీఎల్లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది మినీ వేలంలో రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: ఘనంగా అర్జున్ టెండుల్కర్- సానియా వివాహం.. వీడియో వైరల్


