నటి ఆకృతి అగర్వాల్.. క్రికెటర్ పృథ్వీషాతో ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ చేసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తాజాగా నటి ఆకృతి తన ఫ్యాన్స్‌కు మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తామిద్దరం మళ్లీ కలవబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికాగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆకృతి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. సెప్టెంబర్ 17న బ్రేకప్ ప్రకటించి షాకిచ్చిన ఆకృతి.. నెల రోజుల్లోపే తన నిర్ణయం మార్చుకుంది. తన నిర్ణయంతో అతడికి కలిగిన బాధకు బాధ్యత వహిస్తున్నట్లు ఆమె రాసుకొచ్చింది.
ఆకృతి తన ఇన్‌స్టాలో మాట్లాడుతూ..'ఇటీవల ఇద్దరం మాట్లాడుకున్నాం. పరస్పరం అర్థం చేసుకున్న తర్వాత మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నాం. మా పర్సనల్ లైఫ్‌ను రెస్పెక్ట్ చేయండి. మా నిర్ణయంపై రూమర్స్ ప్రచారం చేయొద్దని' అభిమానులను కోరింది. పృథ్వీ షా సైతం ఆమె పోస్టును రీ షేర్ చేశాడు. కాగా.. టాలీవుడ్ నటి ఆకృతి అగర్వాల్‌తో మార్చి 8న పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.


