Pakistan Overtake India In Latest Updated ICC ODI Rankings, Details Inside - Sakshi
Sakshi News home page

ICC ODI Rankings: భారత్‌ను వెనక్కి నెట్టిన పాక్..!

Jun 14 2022 1:37 PM | Updated on Jun 14 2022 4:44 PM

Pakistan overtake India in ICC ODI rankings - Sakshi

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌.. టీమిండియాను వెనుక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. దీంతో భారత్‌ జట్టు ఐదో స్థానానికి పరిమితమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను పాకిస్తాన్‌ క్వీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. తద్వారా పాక్‌ ఖాతాలో 4 పాయింట్లు వచ్చి చేరాయి. కాగా పాక్‌ 106 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా 105 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.

ఇక 125 పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా.. 124 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో.. 107 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. కాగా త్వరలో టీమిండియా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లలో తలపడనుంది.  దీంతో త్వరలోనే పాకిస్తాన్‌ను వెనుక్కి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్‌ ఆనందం​ మున్నాళ్ల ముచ్చటే అనే చెప్పుకోవాలి.
చదవండి: IND vs SA: 'చాహల్‌ ఫామ్‌ టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement