Neeraj Chopra: వారెవ్వా నీరజ్‌ చోప్రా.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు

Neeraj Chopra Sets New National Record Javelin Throw  Paavo Nurmi Games - Sakshi

టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో రజతం గెలిచిన నీరజ్‌ చోప్రా.. ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో నీరజ్‌ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. తద్వారా అథ్లెటిక్స్‌ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా.. ఓవరాల్‌గా వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు. 

చదవండి: బంగారు కొండ.. టైలర్‌ కలను నెరవేర్చిన కొడుకు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top