National Sports Day: దిగ్గజ హాకీ ప్లేయర్ జయంతిని పురస్కరించుకుని..!

National Sports Day 2022: PM Modi Pays Tribute To Hockey Legend Dhyan Chand - Sakshi

హాకీ దిగ్గజం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఆగస్ట్‌ 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి. ఆసియా కప్‌లో టీమిండియా పాక్‌ను మట్టికరింపించిన మరుసటి రోజే జాతీయ క్రీడా దినోత్సవం ఉండటంతో ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌, క్రికెటేతర క్రీడా సంఘాలు పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి వేడులకు ఘనం‍గా నిర్వహించాయి. ధ్యాన్‌చంద్ 117వ జయంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాకీ పితామహుడికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఇటీవలి కాలంలో భారత్‌ క్రీడల్లో విశేషంగా రాణిస్తుందని, భారత్‌ మున్ముందు ఇదే జోరును కొనసాగించాలని ప్రధాని ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. ప్రధాని తన ట్వీట్‌లో ధ్యాన్‌చంద్‌తో పాటు ఇతర క్రీడలకు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేశారు.

కాగా, వివిధ క్రీడాంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రజల రోజువారీ జీవితంలో ఆటలను భాగం చేయాలనే ఉద్దేశంతో 2012లో హాకీ పితామహుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ పుట్టిన రోజును నాటి కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వివిధ క్రీడా సంఘాలు స్పోర్ట్స్ డేను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.   
చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. ఉత్కంఠ పోరులో విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top