జాతీయ హాకీ విజేత మధ్యప్రదేశ్‌  | National Hockey Champion Madhya Pradesh | Sakshi
Sakshi News home page

జాతీయ హాకీ విజేత మధ్యప్రదేశ్‌ 

Feb 27 2023 3:05 AM | Updated on Feb 27 2023 3:05 AM

National Hockey Champion Madhya Pradesh - Sakshi

సాక్షి, కాకినాడ: జాతీయ మహిళల సీనియర్‌ హాకీ చాంపియన్‌షిప్‌లో మధ్యప్రదేశ్‌ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో మధ్యప్రదేశ్‌ 5–1 గోల్స్‌ తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది.

మధ్యప్రదేశ్‌ తరఫున దీక్షా తివారి (2వ నిమిషం, 4వ ని.), మన్‌మీత్‌ కౌర్‌ (38వ ని.), ప్రీతి దూబే (42వ ని.), ఐశ్వర్య చవాన్‌ (42వ ని.) గోల్స్‌ సాధించగా... మహారాష్ట్ర  జట్టునుంచి లాల్‌రిండికి (25వ ని.) ఏకైక గోల్‌ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిభ ఆర్యకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. మరో వైపు ప్లే ఆఫ్‌ పోరులో  హరియాణాను 2–1తో ఓడించిన జార్ఖండ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.   

Advertisement
 
Advertisement
Advertisement