
భారత మహిళల-ఎ జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఇండియా-ఎ జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు స్పిన్నర్ రాధా యాదవ్ సారథ్యం వహించనుంది. ఆమెకు డిప్యూటీగా మిన్ను మణి వ్యవహరించనుంది. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న యంగ్ ప్లేయర్లు శ్రేయాంక పాటిల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు.
శ్రేయాంక కేవలం టీ20 సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా ఓపెనర్ షఫాలి వర్మ కూడా తిరిగి వన్డే ఫార్మాట్‌లో ఆడేందుకు సిద్దమైంది. డబ్ల్యూపీఎల్‌లో ఆకట్టుకున్న లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా కూడా సెలక్టర్లు చోటు కల్పించారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ ఆతిథ్య ఆస్ట్రేలియా-ఎ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడనుంది.
తొలుత టీ20 సిరీస్ ఆగస్టు 7 నుండి 10 వరకు మాకే వేదికగా జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 13-17 వరకు బ్రిస్బేన్‌లో వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం క్వీన్స్‌ల్యాండ్‌లోని అలన్ బోర్డర్ మైదానం వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ ఆగస్టు 14 నుంచి జరగనుంది.
ఆసీస్‌తో టీ20లకు భారత-ఎ జట్టు
రాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, డి. వృందా, సజన సజీవన్, ఉమా చెత్రీ , రాఘవి బిస్త్, శ్రేయాంక పాటిల్*, ప్రేమ రావత్, నందిని కశ్యప్ (వికెట్ కీపర్), తనూజా కన్వెర్, జోషితా థకేల్, షబ్నం.
వన్డే, టెస్టులకు భారత జట్టు: రాధా యాదవ్ (కెప్టెన్), మిన్ను మణి (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, తనుశ్రీ సర్కార్, ఉమా చెత్రీ , ప్రియా మిశ్రా*, తనుజా కన్వర్, నందిని కశ్యప్ (డబ్ల్యుకె), షబ్‌నమ్ గుజ్జర్, షబ్‌నమ్ గుజ్జర్, ధారా గుజ్జర్ టిటాస్ సాధు.