Urvashi Rautela: సారీ చెప్పింది పంత్‌కు కాదు.. నా ప్రియమైన వారికి..!

My Sorry Was Not Rishabh Pant, Its To My Fans Says Urvashi Rautela - Sakshi

Urvashi Rautela-Rishbah Pant: బాలీవుడ్‌ అప్‌కమింగ్‌ నటి ఊర్వశి రౌతేలా, టీమిండియా యంగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ల మధ్య సోషల్‌మీడియా వార్‌ బ్రేకులు పడ్టట్టే పడి మళ్లీ మొదటికొచ్చింది. నిన్న (సెప్టెంబర్‌ 13)  ఓ బాలీవుడ్‌ రిపోర్టర్‌ ఊర్వశిని పలకరిస్తూ.. మీరు ఆర్పీ (రిషబ్‌ పంత్‌)కి ఏమైనా మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారా అని అడగ్గా.. తొలుత కాస్త ఇబ్బంది పడ్డ ఊర్వశి ఆతర్వాత ఐయామ్‌ సారీ అంటూ చేతులు జోడించి మరీ సమాధానం చెప్పింది. దీంతో ఊర్వశి-పంత్‌ల మధ్య వివాదం సమసిపోయిందని అంతా భావించారు. అందుకనుగునంగా కొందరు సోషల్‌మీడియాలో కామెంట్లు కూడా పెట్టారు. అయితే ఊర్వశి ఈ విషయమై ఇవాళ మాట మార్చింది. నేను సారీ చెప్పింది పంత్‌కు కాదు.. నా ఫ్యాన్స్‌కు అంటూ షాకిచ్చింది. 

ఈ రోజుల్లో కొన్ని అధికారిక న్యూస్ ఆర్టికల్స్, సో కాల్డ్ మీమ్‌ పేజెస్‌ (వరస్ట్ మార్కెటర్స్) సినిమాలు, టీవీ షో ల కంటే ఎక్కువ డ్రామాను రచిస్తున్నారు. నేను సారీ చెప్పింది నా ఫ్యాన్స్ కోసం.. నా ప్రియమైన వారికోసం అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొస్తూ తగ్గేదేలేదన్న సంకేతాన్ని పంపింది. దీంతో పాటు ఊర్వశి.. వై ద న్యూస్ ఈజ్ నాట్ ట్రూత్, ఫాల్స్ మిస్ లీడింగ్ లైట్, గ్రేట్ స్క్రిప్ట్, ఫ్యాక్ట్స్ ఆర్‌ నాట్  కాపీరైటెబుల్ అనే హ్యాష్ ట్యాగ్ లను తన స్టోరీస్‌లో జతపరిచింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఊర్వశి ఏమాత్రం తగ్గుతలేదని, ఆర్పీతో తనకు ఎక్కడో పెద్ద ఇష్యూయే జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. వీరి గొడవ మున్ముందు ఏ స్థాయికి వెళ్తుందోనని గుసగుసలాడుకుంటున్నారు. కాగా, పంత్‌-రౌతేలా మధ్య గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియా వార్‌ నడుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు నెట్టింట ఒకరికొకరు కౌంటర్లు వేసుకుంటూ వివాదాన్ని పెద్దది చేసుకున్నారు. ఊర్వశి అయితే మధ్యలో పాక్‌ బౌలర్‌ నసీమ్‌ షాను కూడా లాగింది. అయితే అతను తనకు ఊర్వశి ఎవరో తెలీదనటంతో ఆ ఎపిసోడ్‌కు బ్రేక్‌ పడింది. నిన్న ఊర్వశి సారీ చెప్పడంతో ఆర్పీతో వివాదానికి కూడా బ్రేక్‌ పడిందని అంతా అనుకున్నారు. అయితే ఊర్వశి సారీ చెప్పింది ఆర్పీకి కాదంటూ బాంబు పేల్చింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top