టీమిండియాలో తుస్సుమన్పించాడు.. అక్కడ మాత్రం చెలరేగిపోయాడు | Sakshi
Sakshi News home page

టీమిండియాలో తుస్సుమన్పించాడు.. అక్కడ మాత్రం చెలరేగిపోయాడు

Published Mon, Feb 19 2024 8:06 AM

Mukesh Kumar picks six as Bengal secures innings victory against Bihar  - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు టీమిండియా పేసర్‌ ముఖేష్‌ కుమార్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్‌ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లిన ముఖేష్‌ కుమార్‌.. బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చేరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి బీహార్‌ పతనాన్ని శాసించాడు. ముఖేష్‌ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లతో సత్తాచాటాడు.

అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం ముఖేష్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వైజాగ్‌ వేదికగా జరిగిన రెండో టెస్టుకు తుది జట్టులోకి వచ్చిన ముఖేష్‌.. కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే రాజ్‌కోట్‌ టెస్టుకు ముందు అతడిని బీసీసీఐ రిలీజ్‌ చేసింది.

ఇక ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్‌ను ఇన్నింగ్స్‌ 204 పరుగులతో తేడాతో బెంగాల్‌ చిత్తు చేసింది. 316 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బీహార్‌.. ముఖేష్‌, జైశ్వాల్‌ దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ముఖేష్‌తో పాటు సూరజ్ సింధు జైస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్‌ 411 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. బెంగాల్‌ బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్‌(200 నాటౌట్‌) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.
చదవండి: IPL 2024: చెన్నై స్టార్‌ బౌలర్‌ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్‌

 
Advertisement
 
Advertisement