Fans shocked as MS Dhoni's DRS on Yashasvi Jaiswal failed badly - Sakshi
Sakshi News home page

MS Dhoni: 'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు'

Apr 27 2023 8:34 PM | Updated on Apr 27 2023 9:09 PM

MS Dhoni Takes DRS About Yashasvi Jaiswal LBW But Lost It - Sakshi

Photo: IPL Twitter

ఎంఎస్‌ ధోని రివ్యూ తీసుకున్నాడంటే చాలా సందర్భాల్లో ఫలితం అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే తన మాస్టర్‌మైండ్‌తో ఆలోచించే ధోని రివ్యూ విషయంలో ఫర్‌ఫెక్ట్‌గా ఉంటాడు. కానీ ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలిసారి ధోని లెక్క తప్పింది. గురువారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోని.. యశస్వి జైశ్వాల్‌ విషయంలో రివ్యూకు వెళ్లాడు.

తీక్షణ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌ మూడో బంతిని జైశ్వాల్‌ స్వీప్‌ ఆడే ప్రయత్నంలో మిస్‌ చేశాడు. ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకి కీపర్‌ ధోని చేతుల్లోకి వెళ్లింది. అంపైర్‌కు అప్పీల్‌ చేయగా ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోని డీఆర్‌ఎస్‌ కోరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకినప్పటికి లెగ్‌స్టంప్‌ ఔట్‌సైడ్‌లో బంతి పిచ్‌ అయినట్లు చూపించింది.

దీంతో జైశ్వాల్‌ నాటౌట్‌ అని తేలగా.. సీఎస్‌కే ఒక రివ్యూను కోల్పోయింది. అయితే అప్పటికే జైశ్వాల్‌ 11 బంతుల్లో 31 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు.  ఒక దశలో సీఎస్‌కే బౌలర్లపై ధోని అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే దాటిగా ఆడుతున్నాడన్న కోపం అనుకుంటా అందుకే రివ్యూకు పోయాడు.. కానీ ఏం లాభం చేతులు కాల్చుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

చదవండి: రాజస్తాన్‌తో మ్యాచ్‌.. ధోని ఉగ్రరూపం గుర్తుందా?

Advertisement
 
Advertisement
Advertisement