
మహేంద్ర సింగ్ ధోని (PC: BCCI)
#OnThisDay, 17 years ago!: పదిహేడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు.. లంక బౌలర్లను ఉతికారేస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. వన్డే కెరీర్‌లో అత్యుత్తమ స్కోరుతో అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 2005 నాటి ఈ వికెట్ బ్యాటర్ తుపాన్ ఇన్నింగ్స్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు.
సచిన్ చేతులెత్తేసిన వేళ..
నాడు ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు శ్రీలంక భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో రాజస్తాన్‌లోని జైపూర్‌లో గల సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా నాటి ద్రవిడ్ సేనతో మూడో వన్డేలో పోటీపడింది.
అప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. అయితే, లంక ఓపెనర్ కుమార్ సంగక్కర సెంచరీ(138- నాటౌట్), మహేల జయవర్దనే అర్ధ శతకం(71)తో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
ఆకాశమే హద్దుగా చెలరేగి..
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 39 పరుగులతో శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ సచిన్ టెండుల్కర్ మాత్రం(2 పరుగులు) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
145 బంతులు ఎదుర్కొన్న తలా.. 15 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 183 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని అజేయ ఇన్నింగ్స్‌కు తోడు.. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 28 పరుగులతో రాణించడంతో 4 వికెట్ల నష్టానికి భారత్ 303 పరుగులు చేసింది. 23 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో మర్వాన్ ఆటపట్టు బృందంపై జయభేరి మోగించింది. ఆ తర్వాత మరో మూడు మ్యాచ్‌లు కూడా గెలిచి సిరీస్‌ను 6-1తో సొంతం చేసుకుంది.
బీసీసీఐ ట్వీట్.. వీడియో వైరల్
ఇక నాటి మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ధోని ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ బీసీసీఐ సోమవారం ట్వీట్ చేసింది. ధోని లంక బౌలింగ్‌ను ఊచకోత కోసిన వీడియోను షేర్ చేస్తూ స్పెషల్ ఇన్నింగ్స్ అంటూ కొనియాడింది. ప్రస్తుతం ఈ వీడియో లైకులు, షేర్లతో దూసుకుపోతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి!
#OnThisDay, 17 years ago! 👌 👌
— BCCI (@BCCI) October 31, 2022
The @msdhoni special! 🎆 🎆#TeamIndia https://t.co/xA8XzK6VAw
చదవండి: T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా
T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు..