Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా

Mohammed Shami Was 3rd Bowler Fewest ODIs  Taken 150 Wickets IND vs ENG - Sakshi

టీమిండియా పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ వన్డే క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. కాగా వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ను అందుకున్న మూడో బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. 80 మ్యాచ్‌ల్లో షమీ 150 వికెట్ల మార్క్‌ను అందుకొని అఫ్గన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌(77 మ్యాచ్‌లు), రెండో స్థానంలో పాకిస్తాన్‌ మాజీ స్టార్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ (78 మ్యాచ్‌లు) ఉండగా.. రషీద్‌, షమీల తర్వాత ట్రెంట్‌ బౌల్ట్‌(81 మ్యాచ్‌లు), బ్రెట్‌ లీ(82 మ్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక​ టీమిండియా నుంచి మాత్రం షమీ 150 వికెట్లను అత్యంత వేగంగా అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు అజిత్‌ అగార్కర్‌(97 మ్యాచ్‌ల్లో) ఈ ఫీట్‌ అందుకున్నాడు.  

ఇక బంతుల పరంగా చూస్తే.. 150 వికెట్లను అత్యంత తక్కువ బంతుల్లో అందుకున్న ఐదో బౌలర్‌గా షమీ నిలిచాడు. 150 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి షమీకి 4071 బంతులు అవసరం కాగా.. మిచెల్‌ స్టార్క్‌(3857 బంతులు) తొలి స్థానంలో.. అజంతా మెండిస్‌(4029 బంతులు), సక్లెయిన్‌ ముస్తాక్‌(4035 బంతులు), రషీద్‌ ఖాన్‌(4040 బంతులు) వరుసగా 2,3,4 స్థానాల్లో ఉన్నారు.  

చదవండి: Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. టీమిండియా తరపున మూడో బౌలర్‌గా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top