సౌతాఫ్రికాపై సంచలన విజయం​.. చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌ | Mohammad Nabi Creates History By Becoming First Player To Win Against 46 Different Teams As Afghanistan Bamboozles South Africa | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాపై సంచలన విజయం​.. చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌

Sep 19 2024 8:16 AM | Updated on Sep 19 2024 10:01 AM

Mohammad Nabi Creates History By Becoming First Player To Win Against 46 Different Teams As Afghanistan Bamboozles South Africa

వన్డే క్రికెట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సీనియర్‌ ప్లేయర్‌ మొహమ్మద్‌ నబీ చరిత్ర సృష్టించాడు. 46 దేశాలపై విజయాల్లో భాగమైన తొలి క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నిన్న షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్‌ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో నబీ ఖాతాలో ఈ భారీ రికార్డు చేరింది.

నబీ విజయాలు సాధించిన 46 దేశాలు..
డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, జపాన్, బహామాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, పపువా న్యూ గినియా, కేమాన్ దీవులు, ఒమన్, చైనా, సింగపూర్, పాకిస్థాన్, ట్రినిడాడ్ మరియు టొబాగో, యూఎస్‌ఏ, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, కెనడా, కెన్యా, హాంకాంగ్, యూఏఈ, జింబాబ్వే, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా

సౌతాఫ్రికాపై తొలి విజయం
షార్జా వేదికగా నిన్న (సెప్టెంబర్‌ 18) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సౌతాఫ్రికాపై ఇది తొలి విజయం.

SENA  దేశాలపై విజయాలు
ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్‌ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాలన్నిటిపై (వన్డేల్లో) విజయాలు సాధించినట్లైంది.

ఏడాదికాలంగా సంచలనాలు..
ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు గతేడాది కాలంగా ఫార్మాట్లకతీతంగా సంచలన విజయాలు సాధిస్తుంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకపై విజయాలు సాధించిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ లాంటి జట్లకు షాకిచ్చి ఏకంగా సెమీస్‌కు చేరింది.

భారత్‌ మినహా..
ఇటీవలికాలంలో పెద్ద జట్లన్నిటికీ షాక్‌ ఇస్తున్న ఆఫ్ఘనిస్తాన్‌.. ఒక్క భారత్‌ మినహా అన్ని ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ దేశాలపై విజయాలు సాధించింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. 33.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఫజల్‌ హక్‌ ఫారూకీ 4, ఘజనఫర్‌ 3, రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికా పతనాన్ని శాశించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు (వియాన్‌ ముల్దర్‌ (52), ఫోర్టుయిన్‌ (16), టోని డి జోర్జీ (11), వెర్రిన్‌ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్‌ 26 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (25), గుల్బదిన్‌ నైబ్‌ (34) అజేయ ఇన్నింగ్స్‌లతో ఆఫ్ఘనిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫోర్టుయిన్‌ 2, ఎంగిడి, మార్క్రమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్‌ 20న జరుగనుంది. 

చదవండి: శతక్కొట్టిన కమిందు మెండిస్‌.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement