షోకాజ్‌ నోటీసుకు జవాబివ్వను.. లీగల్‌గా తేల్చుకుంటా: అజారుద్దీన్‌

Mohammad Azharuddin Fires On HCA About Electing Interim President - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హెచ్‌సీఏలో వివాదం రోజురోజుకు ముదిరి పాకానా పడుతుంది. తాజాగా తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్‌ మనోజ్‌ ఎంపికపై మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ స్పందించాడు. ''తాత్కాలిక‌ ప్రెసిడెంట్ నియామకంపై నేను స్పందించను. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ చేస్తున్నది అక్రమమైన పని. నన్ను ప్రెసిడెంట్ గా తొలగించే అవకాశం అపెక్స్ కమిటీ సభ్యులకు లేదు. అలా తొలగించే అవకాశం ఉంటే... ప్రెసిడెంట్ గా ఉండి నేనే వారిని తొలగించేవాడిని.

చాలా ఏళ్ళుగా ఈ సభ్యులు హెచ్‌సీఏను భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలని నేను చూస్తున్నాను. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కావడం ఆ సభ్యులకు ఇష్టం లేదు. నేను లీగల్గానే తేల్చుకుంటాను. ఇప్పటికే వాళ్ల మీద అంబుడ్స్మెన్ కు కంప్లైంట్ చేసాను. అంబుడ్స్మెన్ ఇచ్చే నిర్ణయమే నా తుది నిర్ణయం కూడా..'' అంటూ అజారుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్‌ మనోజ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top