బౌన్సర్లు ఎదుర్కోలేమంటే ఆడడం ఎందుకు?

Michael Vaughan Says Ban Bouncers At Junior Level Then Apply To Senior - Sakshi

లండన్‌: జూనియర్‌ క్రికెట్‌ స్థాయిలో బౌన్సర్లు నిషేధించాల్సి వస్తే సీనియర్‌ స్థాయి క్రికెట్‌లోనూ దానిని వర్తింపజేయాలని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ షార్ట్‌పిచ్‌ బంతులను బ్యాన్‌ చేయాలనుకుంటే ముందు సీనియర్‌ స్థాయి క్రికెట్‌లో బ్యాన్‌ చేయాలని తెలిపాడు. కాగా కంకషన్‌ స్పెషలిస్ట్‌గా ఉన్న మైఖెల్‌ టర్నర్‌ అనే వ్యక్తి 18 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి షార్ట్‌ పిచ్‌ బంతులను బ్యాన్‌ చేయాలంటూ ఇటీవలే అధికారుల వద్ద ప్రతిపాధన తీసుకొచ్చాడు. మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి)లో బౌలర్లు షార్ట్‌ పిచ్‌ బంతులు వేయాలా? వద్దా? అన్న చర్చలో భాగంగా టర్నర్‌ ఈ విషయాన్ని ప్రస్తవించాడు.  అయితే ఇదే విషయమై వాన్‌ తనదైన శైలిలో స్పందించాడు.చదవండి: కొత్త ఇల్లు కొనమని వెంటపడుతున్నారు

'టర్నర్‌ చేసిన ప్రతిపాధన హాస్యాస్పదంగా ఉంది. బౌన్సర్లు ప్రమాదకరమని తెలిసినా జూనియర్‌ స్థాయి నుంచి వాటిని ఎదుర్కొనే నైపుణ్యం అలవరచుకోవాలి. జూనియర్‌ క్రికెట్‌ స్థాయిలోనే ఆటగాళ్లు తమ ఆటకు పదును పెట్టుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండర్‌ -19లో షార్ట్‌ పిచ్‌ బంతులను బ్యాన్‌ చేయాలనేది కరెక్ట్‌ కాదు. చిన్న పిల్లల స్థాయి క్రికెట్‌లో మొదటసారి మాత్రమే బౌన్సర్‌ ఎదుర్కొనేటప్పుడు మాత్రమే ప్రమాదకరంగా కనిపిస్తుంది. జూనియర్‌ స్థాయిలో నా పిల్లలు కూడా క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నారు. అంతమాత్రానా షార్ట్‌పిచ్‌ బంతులను బ్యాన్‌ చేయాలని నేను చెప్పలేను. ఒకవేళ బ్యాన్‌ చేయాలనుకుంటే జూనియర్‌ స్థాయితో పాటు సీనియర్‌ స్థాయి క్రికెట్‌లో ఎప్పుడో షార్ట్‌ పిచ్‌ బంతుల్ని బ్యాన్‌ చేయాల్సింది. ఎందుకంటే సీనియర్‌ స్థాయి క్రికెట్‌లో ఇప్పటికే బౌన్సర్లు ఎదుర్కొని ఎందరో గాయాలపాలు కాగా.. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అలాంటి బౌన్సర్లను ఎదుర్కోలేనప్పుడు క్రికెట్‌ ఆడడంలో అర్థం ఉండదు' అని వెల్లడించాడు.చదవండి: ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి

కాగా 2014లో ఆసీస్‌ క్రికెటర్‌ ఫిలిప్‌ హ్యూజ్‌ షార్ట్‌ పిచ్‌ బంతికి బలవడం క్రికెట్‌ ప్రపంచంలో పెను విషాదంగా నిలిచిపోయింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భాగంగా బౌలర్‌ సీన్‌ అబాట్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి హ్యూజ్‌ మెడకు బలంగా తగిలింది. దీంతో మైదానంలోనే కూలబడిన హ్యూజ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి హ్యూజ్‌ కన్నుమూయడం విషాదంగా మారింది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top