ఇంగ్లండ్‌కు ఊహించ‌ని ఎదురు దెబ్బ‌.. స్టార్ క్రికెటర్‌కు గాయం | Mark Wood unavailable for rest of year due to elbow injury | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌కు ఊహించ‌ని ఎదురు దెబ్బ‌.. స్టార్ క్రికెటర్‌కు గాయం

Sep 7 2024 12:51 PM | Updated on Sep 7 2024 2:34 PM

Mark Wood unavailable for rest of year due to elbow injury

ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మార్క్ వుడ్ గాయం కార‌ణంగా ఆరు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉండ‌నున్నాడు. గ‌త నెల‌లో స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో వుడ్‌కు తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి. దీంతో అత‌డు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా శ్రీలంక‌తో జ‌ర‌గుతున్న టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. 

అయితే తొడ కండరాల గాయం నుంచి కోలుకుని తిరిగి ప్రాక్టీస్ మొద‌లు పెట్టిన వుడ్ మ‌ళ్లీ గాయ‌ప‌డ్డాడు. బౌలింగ్ చేసే క్ర‌మంలో మోచేయి నొప్పి రావ‌డంతో అత‌డు అస్ప‌త్రికి వెళ్లి స్కానింగ్ చేసుకున్నాడు. అయితే స్కానింగ్‌లో కూడి మోచేయి జాయింట్‌ ఎముక విరిగిన‌ట్లు నిర్ధార‌ణైంది. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి దాదాపు 5 నుంచి 6 నెల‌ల స‌మయం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

 ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌, న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌ల‌కు అత‌డు దూరం కానున్నాడు. ఈ విష‌యాన్ని మార్క్ వుడ్ సైతం ధ్రువీక‌రించాడు. త‌న మోచేయిలో ఎముక బ్రేక్ ఉంద‌ని తెలియ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయాను అని వుడ్ పేర్కొన్నాడు.

 ఈ ఏడాది మొత్తానికి ఆట‌కు ఉండనున్న‌ట్లు వుడ్ తెలిపాడు. అదేవిధంగా 2025లో మ‌రింత ఫిట్‌నెస్‌తో తిరిగి వ‌స్తానాని వుడ్ వెల్ల‌డించాడు. వుడ్‌ మళ్లీ ఛాంపియన్స్‌ ట్రోఫీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement