సెమీస్‌లో మాళవిక  | Malvika in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో మాళవిక 

Dec 9 2023 4:13 AM | Updated on Dec 9 2023 4:13 AM

Malvika in the semis - Sakshi

గువాహటి: గువాహటి మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత రైజింగ్‌ స్టార్‌ మాళవిక బన్సోద్‌ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మాళవిక 21–12, 21–16తో కరుపతెవన్‌ లెట్షానా (మలేసియా)పై గెలుపొందింది.

మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం 22–20, 21–16తో జెసితా పుత్రి మియాన్‌తొరో–ఫెబి సెతియనిన్‌గ్రమ్‌ (ఇండోనేసియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్‌ (భారత్‌) ద్వయం 9–21, 14–21తో చూంగ్‌ హోన్‌ జియాన్‌–హైకాల్‌  (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement