Lockie Ferguson: ఫెర్గూసన్ చెత్త రికార్డు..

Lockie Ferguson.. సీఎస్‌కేతో జరుగుతున్న ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ లోకి ఫెర్గూసన్ చెత్త రికార్డు నమోదు చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఫెర్గూసన్ 4 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి. ఇక్కడ విశేషమేమిటంటే.. ఫెర్గూసన్ గత సీజన్‌లోనూ దుబాయ్ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనే ఫెర్గూసన్ 54 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే కేకేఆర్‌కు 193 పరుగుల భారీ లక్ష్యం విధించింది. సీఎస్‌కే ఓపెనర్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86;7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. రుతురాజ్ 32, ఊతప్ప 31 పరుగులు చేశారు. ఆఖర్లో మొయిన్ అలీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేయడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2, శివమ్ మావి 1 వికెట్ తీశాడు.