
ఆసియాకప్-2023 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ లిట్టన్ దాస్ అనారోగ్యం కారణంగా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. గత కొన్ని రోజుల నుంచి లిట్టన్ దాస్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని మరో వికెట్ కీపర్ బ్యాటర్ అనముల్ హక్ బిజోయ్‌ను బంగ్లాదేశ్ సెలక్టర్లు భర్తీ చేశారు.
అనముల్ హక్ బుధవారం బంగ్లా జట్టుతో కలవనున్నాడు. దురదృష్టవశాత్తూ లిట్టన్ దాస్ ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అతడి స్ధానంలో మేము అనాముల్ హక్‌కు అవకాశం ఇచ్చాము. అనాముల్ దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడు ఎప్పుడూ మా దృష్టిలో ఉంటాడు. లిట్టన్ లేక పోవడంతో మాకు వికెట్ కీపింగ్ చేయగల టాప్-ఆర్డర్ బ్యాటర్ అవసరమైంది.
దీంతో అనాముల్ జట్టులోకి వచ్చాడని బంగ్లా సెలక్షన్ కమిటీ చైర్మెన్ మిన్హాజుల్ అబెదిన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 44 వన్డేలు ఆడిన అనాముల్ హక్.. 1254 పరుగులు సాధించాడు. ఒక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న శ్రీలంకతో తలపడనుంది.
ఆసియాకప్‌కు బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హుస్సేన్ , మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, షక్ మహ్మద్, షక్ మహ్మద్ తాంజిద్ హసన్ తమీమ్, తంజిమ్ హసన్ సాకిబ్, అనముల్ హక్ బిజోయ్
చదవండి: Asia Cup 2023: అతడు మళ్లీ వస్తాడన్న గ్యారంటీ లేదు.. కిషన్ వచ్చినా గానీ?