Lionel Messi And His Wife Antonella Roccuzzo Blocks Fan Suzy Cortez Account In Social Media - Sakshi
Sakshi News home page

Lionel Messi Fan Suzy Cortez: మెస్సీకి వీరాభిమాని.. రెచ్చగొట్టే ఫోటోలతో చేతులు కాల్చుకుంది

Jun 8 2022 3:58 PM | Updated on Jun 8 2022 5:09 PM

Lionel Messi Fan Suzy Cortez Model Account Blocked By Argentina Star - Sakshi

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మాములుగా ఉండదు. క్రికెట్‌ కంటే ఫుట్‌బాల్‌ను విపరీతంగా ఇష్టపడే అభిమానులు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోతో పోటీపడుతున్న మెస్సీ.. తన ఫాలోయింగ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ ఎనలేని క్రేజ్‌ సంపాదించాడు. ఆటలో చురుకుగా కనిపించే మెస్సీ బయట కూడా అంతే చలాకీగా ఉంటాడు. తనను కలుసుకోవడానికి ఒక అభిమాని ఎంత దూరం నుంచి వచ్చినా.. తప్పక వారిని కలిసి సంతోషం కలిగేలా చేసేవాడు. అలాంటి మెస్సీని అందమైన యువతులు ఇష్టపడడం మాములే. అలాంటి కోవకే చెందింది బ్రెజిలియన్‌ మోడల్‌ సుజీ కోర్టేజ్. 

సుజీ కోర్టేజ్‌.. మెస్సీకి వీరాభిమాని. అతని ఆటను చూసేందుకు చాలాసార్లు ఫుట్‌బాల్‌ స్టేడియంలోకి వెళ్లింది. అతని ఆటోగ్రాఫ్‌ కోసం ఎంతో ప్రయత్నించి ఒక సందర్భంలో సక్సెస్‌ అయింది. అయితే ఆమె స్వయానా మోడల్‌ కావడంతో కొన్ని రెచ్చగొట్టే చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి మెస్సీ ఆగ్రహాన్ని చవిచూసింది. అంతేకాదు స్వయంగా మెస్సీ, అతని భార్య ఆంటోనెల్లా రోకుజోలు సుజీ కోర్టేజ్‌ అకౌంట్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేశారు. 


సుజీ కోర్టెజ్‌.. మెస్సీకి వీరాభిమాని మాత్రమే కాదు. మంచి అథ్లెట్‌, మోడల్‌, టీవీ హోస్ట్‌ ఇలా చాలా రంగాల్లో ముఖ్యపాత్ర పోషించింది. తన టాలెంట్‌తో 2015లో ''మిస్‌ బుమ్‌బుమ్‌'' విన్నర్‌గానూ నిలిచింది. సుజీ కోర్టెజ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 58వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాదు ఇటీవలే ప్లేబాయ్‌ మ్యాగజైన్‌ కవర్‌పై మెరిసింది. 2015లో మిస్‌ బుమ్‌బుమ్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత 2016 రియో ఒలింపిక్స్‌లో అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం.

చదవండి: జిడ్డు ఇన్నింగ్స్‌కు 47 ఏళ్లు.. కోపంతో లంచ్‌ బాక్స్‌ విసిరేసిన క్రికెట్‌ అభిమాని

వేల కోట్లు వద్దనుకున్నాడు.. బిలీనియర్‌ అయ్యే చాన్స్‌ మిస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement