హామిల్టన్‌ హవా | Lewis Hamilton Claims Fourth Win In F1 Season Championship | Sakshi
Sakshi News home page

హామిల్టన్‌ హవా

Aug 17 2020 1:15 AM | Updated on Aug 17 2020 1:15 AM

Lewis Hamilton Claims Fourth Win In F1 Season Championship - Sakshi

బార్సిలోనా (స్పెయిన్‌): క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్‌ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ (ఎఫ్‌1) రేసులో హామిల్టన్‌ చాంపియన్‌గా నిలిచాడు. 66 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ప్రారంభించిన హామిల్టన్‌ ఆద్యంతం తన ఆధిక్యాన్ని కొనసాగించి అందరికంటే ముందుగా గంటా 31 నిమిషాల 45.279 సెకన్లలో లక్ష్యానికి చేరి విజేత అయ్యాడు. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 88వ విజయం కావడం విశేషం. రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానంలో, మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లో ఆరు రేసులు ముగిశాక డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్‌ 132 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి ఈనెల 30న జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement