Lewis Hamilton: టైటిల్‌ గెలవకపోయినా ప్రపం‍చ రికార్డు బద్దలు

Lewis Hamilton Break Long Stand Record Finish-Up Podium Bahrain Grand Prix - Sakshi

ఫార్ములావన్‌లో ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో మైలురాయిని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ ఎఫ్‌1 రేసును మూడో స్థానంతో ముగించాడు. టైటిల్‌ గెలవడంలో విఫలమైనప్పటికి 16 ఏళ్ల తన రికార్డును మాత్రం కాపాడుకున్నాడు. ఎఫ్‌1 రేసులో హామిల్టన్‌ పోడియంను మూడో స్థానంతో ముగించాడు. ఒక గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ తన స్థానాన్ని పోడియంతో ముగించడం వరుసగా 16వ ఏడాది కావడం విశేషం. ఇంతకముందు లెజెండరీ ఫార్ములావన్‌ డ్రైవర్‌ మైకెల్‌ షుమాకర్‌ మాత్రమే ఉన్నాడు. తాజాగా హామిల్టన్‌ ఆ ఘనత సాధించి ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు 250 రేసుల్లో పాయింట్లు సాధించిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్‌ నిలిచాడు. 

ఇక  క్వాలిఫయింగ్‌ సెషన్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌. ఆదివారం జరిగిన ఫార్ములావన్‌ సీజన్‌ తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్‌లెర్క్‌ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్‌ సెయింజ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు.

చదవండి: Indian Wells Final: నాదల్‌కు ఊహించని షాక్‌.. అమెరికా యువ ఆటగాడి సంచలన విజయం

క్రీజులోకి వస్తూనే ప్రత్యర్థి ఆటగాళ్లను ఫూల్స్‌ చేశాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top