Legends League Cricket 2022: భారత్‌ వేదికగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్‌ సీజన్‌

Legends League Crickets 2nd Edition Shifted To India From Oman - Sakshi

లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 వేదికను ఒమన్‌ నుంచి భారత్‌కు తరిలించారు. ఒమన్‌కు బదులుగా భారత్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు లీగ్‌ నిర్వహకులు వెల్లడించారు. కాగా లెజెండ్స్ లీగ్ తొలి సీజన్‌ ఒమన్‌ వేదికగానే జరిగినప్పటికీ.. భారత్‌ నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో వేదికను ఒమన్‌ నుంచి భారత్‌కు మార్చాలని లెజెండ్స్ లీగ్ క్రికెట్ కమిటీ నిర్ణయించింది. ఈ టోర్నీ సెప్టెంబర్‌ 20 నుంచి ఆక్టోబర్‌ 10 వరకు జరగనుంది. లెజెండ్స్ లీగ్ రెండో సీజన్‌లో తొమ్మిది దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు పాల్గొనున్నారు.

"భారత్‌లోనే టోర్నమెంట్‌ నిర్వహించాలని అభిమానుల అభ్యర్థనలు దృష్ట్యా వేదికలో మార్పు చేశాం. స్వదేశానికి లెజెండ్స్ లీగ్‌ టోర్నీను తీసుకురావడం సంతోషంగా ఉంది. భారత్‌లో క్రికెట్‌ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మొదటి సీజన్‌ను భారత్‌ నుంచే ఎక్కువ మంది వీక్షించారు. ఆ తర్వాతి స్థానంలో పాకిస్తాన్‌, శ్రీలంక ఉన్నాయి" అని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో రామన్ రహే పేర్కొన్నారు.
చదవండి: భారత్‌కు ఆసియా కప్‌, ప్రపంచకప్‌ అందించడమే నా ప్రధాన లక్ష్యం: కోహ్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top