అహ్మదాబాద్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. రెండోరోజు ఆటలో కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా 300 పరుగుల మార్క్‌ను అందుకుంది. సెంచరీ భాగస్వామ్యంతో పటిష్టంగా తయారైన ఖవాజా, గ్రీన్ జోడిని విడదీయడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 112 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఖవాజా 138, గ్రీన్ 71 పరుగులతో ఆడుతున్నారు.
ఈ విషయం పక్కనబెడితే.. తొలిరోజు ఆటలో భాగంగా కోహ్లి కేఎస్ భరత్‌పై సీరియస్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా పట్ల భరత్ తీరును తప్పుబడుతూ అతన్ని క్షమాపణ కోరమని ఆదేశించాడు. కోహ్లి తప్పుబట్టేలా కేఎస్ భరత్ ఏం చేశాడో తెలుసుకోవాలనుందా.. అయితే ఈ వార్త చదివేయండి. తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 71వ ఓవర్ షమీ వేశాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులతో ఆడుతుంది. ఖవాజా క్రీజులో ఉన్నాడు.
షమీ వేసిన బౌన్సర్‌ను ఖవాజా తప్పించుకోవడంతో బంతి కీపర్ కేఎస్ భరత్ చేతుల్లో పడింది. అయితే బంతిని షమీకి విసిరే ప్రయత్నంలో ఖవాజా చేతి వేలికి బలంగా తాకింది. దీంతో వెనక్కి తిరిగిన ఖవాజా..ఇదేంటి అన్నట్లుగా చూశాడు. భరత్ చర్యను తప్పుబట్టిన కోహ్లి.. వెళ్లి క్షమాపణ చెప్పు అని పేర్కొన్నాడు. దీంతో ఖవాజా దగ్గరికి వెళ్లిన కేఎస్ భరత్ అతన్ని క్షమాపణ కోరాడు. ''పర్లేదు.. కానీ కొంచెం పైనుంచి విసిరితే సరిపోయేది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక నాలుగో టెస్టులో ఖవాజా సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. అతనికి టెస్టుల్లో ఇది 14వ సెంచరీ అయినప్పటికి టీమిండియాపై ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. అందుకే తొలిరోజు ఆట ముగియగానే ఖవాజా మాట్లాడుతూ ఎమెషనల్ అయ్యాడు. ''ఈ సెంచరీ చాలా విలువైనది.. గతంలో రెండుసార్లు టీమిండియా పర్యటనకు వచ్చినప్పుడు డ్రింక్స్ మాత్రమే మోశాను.. జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ ఈసారి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నా. ఈ సెంచరీ నాకు ప్రత్యేకమైనది'' అంటూ పేర్కొనడం ఆసక్తి కలిగించింది.
— MAHARAJ JI (@MAHARAJ96620593) March 9, 2023
చదవండి: బ్యాటింగ్‌లో రికార్డు భాగస్వామ్యం.. సిరీస్‌లో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment