వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు మరో గుడ్‌ న్యూస్‌.. అతడు కూడా వచ్చేస్తున్నాడు!

KL Rahul starts walking without crutches, rehab from next week - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు భారత జట్టుకు మరో గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా భారత జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహల్‌.. మరో రెండు వారాల్లో బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో తన పునరవాసాన్ని(శిక్షణ) ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు సారధ్యం వహించిన రాహుల్‌ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు.

దీంతో గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం లండన్‌లో​ రాహుల్‌ సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ తర్వాత రాహుల్‌ తన భార్య అతియా శెట్టితో కలిసి ఊతకర్రల సాయంలో లండన్‌ వీధుల్లో నడుస్తూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం రాహుల్‌ క్రచెస్(ఊతకర్రలు) లేకుండా నడవడం ప్రారంభించినట్లు సమాచారం. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం..
ఇక గాయం కారణంగా రాహల్‌ ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌తో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భర్తీ చేసింది. అదే విధంగా ఆసియాకప్‌-2023కు కూడా రాహుల్‌ దూరమైనట్లే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతడు పూర్తిఫిట్‌నెస్‌ సాధించాడనికి మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

కేఎల్‌ మళ్లీ వన్డే వరల్డ్‌కప్‌తో మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్‌ ఉంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో గాయ పడ్డ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ కూడా ఈ మెగా టోర్నీతోనే రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ ఉంది. వీరిద్దరితో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌, స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా కూడా ప్రపంచకప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండిWTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top