KL Rahul and Rishabh Pant Promotion Rahane-Pujara Demotion BCCI Contracts - Sakshi
Sakshi News home page

రాహుల్‌, పంత్‌కు ప్రమోషన్‌.. రహానే, పుజారాలకు డిమోషన్‌!

Jan 26 2022 8:30 AM | Updated on Jan 26 2022 9:49 AM

KL Rahul-Rishabh Pant Promotion Rahane-Pujara Demotion BCCI Contracts - Sakshi

టీమిండియా క్రికెటర్లు కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లకు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌లో ప్రమోషన్‌ లభించనున్నట్లు సమాచారం. తాజాగా ప్రకటించనున్న సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో గ్రేడ్‌-ఏ ప్లస్‌ కేటగిరికి ప్రమోట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2021 వార్షిక ఏడాదికి గాను బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్‌లో వీరిద్దరు గ్రేడ్‌-ఏలో ఉన్నారు. కొంతకాలంగా కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ ఆటగాళ్లుగా మారిపోయారు. తమకు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకోకుండా మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతుండడంతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో ప్రమోషన్‌ ఇవ్వాలని భావిస్తోంది.ఇప్పటివరకు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రాలు మాత్రమే గ్రేడ్‌-ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్నారు. 

చదవండి: కేఎల్‌ రాహుల్‌ ఏ కోశాన్నైనా కెప్టెన్‌లా అనిపిస్తున్నాడా: బీసీసీఐ అధికారి

అదే సమయంలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు అజింక్యా రహానే, చతేశ్వర్‌ పుజారాలకు కాంట్రాక్ట్‌లో డిమోషన్‌ లభించనుందని వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఈ ఇద్దరు క్రికెటర్లు సరైన ఫామ్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు గ్రేడ్‌-ఏలో ఉన్న రహానే, పుజారాలను గ్రేడ్‌-బి కాంట్రాక్ట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 28 మంది ఆటగాళ్లతో జాబితా తయారు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్రకటించేందుకు ముగ్గురు ఆఫీస్‌ బేరర్స్‌తో పాటు.. ఐదుగురు సెలక్టర్లు... జాతీయస్థాయి కోచ్‌లతో కమిటీ సిద్ధమైంది. త్వరలోనే బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించనున్నారు.

ఇక ఏడాది కాలంగా బౌలర్‌గా మంచి ప్రదర్శన ఇస్తున్న మహ్మద్‌ సిరాజ్‌ను గ్రేడ్‌ సి నుంచి గ్రేడ్‌ బికి మార్చే అవకాశం ఉంది. టెస్టుల్లో అదరగొట్టిన శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు హనుమ విహారిలకు ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. ఇక ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌శర్మలకు డిమోషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బీసీసీఐ ప్రకటించే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నాలుగు కేటగిరీలు. అవి ఏ ప్లస్‌, ఏ , బి, సిలుగా ఉన్నాయి.
►ఏ ప్లస్‌ కేటగిరి కింద ఒక్కో ఆటగానికి వార్షిక కాంట్రాక్ట్‌పై రూ.7 కోట్లు చెల్లిస్తారు
►ఏ కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తారు.
►బి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.3 కోట్లు చెల్లిస్తారు
►సి కేటగిరి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి చెల్లిస్తారు.

గత సీజన్ (2021) బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
►గ్రేడ్ ఏ ప్లస్‌: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్‌ బుమ్రా
►గ్రేడ్ ఏ: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, కేఎల్‌ రాహుల్, మహ్మద్‌ షమీ, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా
►గ్రేడ్ బి: వృద్ధిమాన్ సాహా, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌
►గ్రేడ్ సి: కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చహర్, శుబ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహ్మద్‌ సిరాజ్

Advertisement
 
Advertisement
Advertisement