టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌ | Kings Eleven Punjab Won The Toss And Elected To Field Against Delhi | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

Sep 20 2020 7:06 PM | Updated on Sep 20 2020 7:54 PM

Kings Eleven Punjab Won The Toss And Elected To Field Against Delhi - Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌-2020 సీజన్‌ రెండో మ్యాచ్‌ దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఢిల్లీ కేపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌‌ ఎంచుకుంది. యువ క్రికెటర్లు, సీనియర్ ఆటగాళ్లు పుష్కలంగా ఢిల్లీ జట్టే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సందీప్ లామిచాన్ వంటి యువ క్రికెటర్స్.. శిఖర్ ధావన్, అజింక్య రహానే, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫినిషర్స్ కు కొదవ లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పే ప్లేయర్స్ ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ అనుభవం యువ బౌలర్లకు చాలా ఉపయోగపడుతుంది. పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ఇషాంత్‌ శర్మ, కగిసో రబడా, కీమో పాల్‌, మోహిత్‌ శర్మ, క్రిస్‌ వోక్స్‌లు ఉన్నారు. పంజాబ్‌ జట్టుకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
(చదవండి: ‘ప్లేఆఫ్స్‌కు చేరకపోతే నేను ఫెయిలైనట్లే’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement