"రోహిత్‌ శర్మ విఫలమవుతున్నాడు.. అతడిని ఓపెనర్‌గా పంపండి' | Kaneria suggests changes in Virat Kohli and Rohit Sharmas batting position | Sakshi
Sakshi News home page

IND vs AUS: "రోహిత్‌ శర్మ విఫలమవుతున్నాడు.. అతడిని ఓపెనర్‌గా పంపండి'

Sep 22 2022 4:28 PM | Updated on Sep 22 2022 4:37 PM

Kaneria suggests changes in Virat Kohli and Rohit Sharmas batting position - Sakshi

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజాయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-1 తేడాతో భారత్‌ వెనుకంజలో ఉంది. బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌, పీల్డింగ్‌లో దారుణంగా విఫలమై ఓటమిని మూట కట్టుకుంది. అదే విధంగా ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి కూడా నిరాశపరిచారు.

ఇక నాగపూర్‌ వేదికగా శుక్రవారం ఆస్టేలియాతో జరగనున్న రెండో టీ20లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో రోహిత్‌, కోహ్లి స్థానాలను మార్పు చేయాలనిభారత జట్టు మేనేజేమెంట్‌ను  కనేరియా సూచించాడు.

విరాట్‌ను ఓపెనర్‌గా పంపండి!
యూట్యూబ్‌ ఛానల్‌లో కనేరియా మాట్లాడూతూ.. రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా విఫలమవుతున్నాడు. ఆసియాకప్‌లోనూ అతడు తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక విరాట్‌ కోహ్లి కూడా మూడో  స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అంతగా రాణించలేకపోతున్నాడు.

కాబట్టి రాహుల్‌ జోడిగా విరాట్‌ను పంపిచండి. రోహిత్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది. లేదంటే రాహుల్‌ను ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపి రోహిత్‌ జోడిగా విరాట్‌కు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఓపెనర్‌గా విరాట్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది అని పేర్కొన్నాడు.
చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement