5 వేల మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డు  | Joshua Cheptegei Made World Record In Five Thousand Meters At Monaco Track Meet | Sakshi
Sakshi News home page

5 వేల మీటర్లలో కొత్త ప్రపంచ రికార్డు 

Aug 16 2020 4:15 AM | Updated on Aug 16 2020 8:28 AM

Joshua Cheptegei Made World Record In Five Thousand Meters At Monaco Track Meet - Sakshi

మొనాకో: ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో ఉగాండా రన్నర్‌ జాషువా చెప్టెగయ్‌ పురుషుల 5 వేల మీటర్ల విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 23 ఏళ్ల చెప్టెగయ్‌ 5 వేల మీటర్ల రేసును 12 నిమిషాల 35.36 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏళ్లుగా కెనెనిసా బెకెలె (ఇథియోపియా–12ని:37.35 సెకన్లు) పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును చెప్టెగయ్‌ బద్దలు కొట్టాడు. గత ఏడాది దోహాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో చెప్టెగయ్‌ స్వర్ణ పతకాన్ని సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement