బంతి అంచనా వేసేలోపే క్లీన్‌బౌల్డ్‌.. షాక్‌ తిన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ | Joe Root Left Absolute Disbelief After Delivery Crash Stumps Viral | Sakshi
Sakshi News home page

ENG vs WI: బంతి అంచనా వేసేలోపే క్లీన్‌బౌల్డ్‌.. షాక్‌ తిన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌

Mar 9 2022 11:20 AM | Updated on Mar 9 2022 11:46 AM

Joe Root Left Absolute Disbelief After Delivery Crash Stumps Viral - Sakshi

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తాను ఔటైన విధానంపై షాక్‌ తిన్నాడు. కీమర్‌ రోచ్‌ వేసిన బంతిని అంచనా వేసేలోపే రూట్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.  ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. వాస్తవానికి తొలి బంతికే రూట్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకుతూ థర్డ్‌స్లిప్‌లో పడింది. అయితే ఫీల్డర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బౌండరీ వెళ్లింది. ఈ అవకాశాన్ని రూట్‌ సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆరంభం నుంచే ఇబ్బందిగా గడిపిన రూట్‌ 13 పరుగులు చేసి తర్వాతి బంతికే బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 268 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌ స్టో(109 నాటౌట్‌) సూపర్‌ సెంచరీతో ఆకట్టుకోగా.. బెన్‌ ఫోక్స్‌ 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకముందు ఓపెనర్లు అలెక్స్‌ లెస్‌ (4), క్రాలే (8), జో రూట్‌ (13), డాన్‌ లారెన్స్‌ (20), స్టోక్స్‌ (36) పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement