పాపం రూట్‌.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్ | ICC Cricket World Cup 2023: Joe Root Gets Nutmegged And Bowled By Logan Van Beek - Sakshi
Sakshi News home page

World cup 2023: పాపం రూట్‌.. చెత్త షాట్‌కు తప్పదు భారీ మూల్యం! వీడియో వైరల్

Published Wed, Nov 8 2023 4:50 PM

Joe Root gets nutmegged and bowled by Logan van Beek - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పుణే వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 28 పరుగులు మాత్రమే చేసి రూట్‌ ఔటయ్యాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రూట్‌.. ఓ నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 20 ఓవర్‌ వేసిన లోగాన్ వాన్ బీక్‌ బౌలింగ్‌లో రెండో బంతికి రూట్‌ ర్యాంప్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

రూట్‌ సరైన పొజిషేషన్‌లో లేకపోవడంతో బంతి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అస్సలు ఆ బంతికి రూట్‌ ఆ షాట్‌ ఆడే అవసరమే లేదు. కానీ అనవసరపు షాట్‌ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే అంతకుముందు ఓవర్‌లో ఆ తరహా షాటే ఆడి బౌండరీని రూట్‌ రాబట్టాడు. కానీ రెండో సారి మాత్రం తన వికెట్‌ను సమర్పించుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా 2019 వరల్డ్‌కప్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచిన రూట్‌.. ఈ సారి మాత్రం తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు రూట్‌ కేవలం 203 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అయితే ఏకంగా గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.
చదవండి#Maxwell-Cummins: ప్రతి ‘బ్యాట్‌మ్యాన్‌’కి ఇలాంటి రాబిన్‌ ఉండాలన్న ఐసీసీ! ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసినపుడు కూడా.

Advertisement
 
Advertisement