ఇంగ్లాండ్ పిచ్‌పై హైదరాబాదీ రికార్డు
579 పరుగులతో ‘ఉత్తమ బ్యాట్స్‌మన్’ అవార్డు
హైదరాబాద్‌కు చెందిన వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ పుల్ల అశ్విన్ సూరజ్ ఇంగ్లాండ్ పిచ్‌పై రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ క్రికెట్ సీజన్–2025లో హెర్ట్‌ఫోర్డ్‌షైర్ ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో వాట్‌ఫోర్డ్ టౌన్ క్రికెట్ క్లబ్ తరపున 579 పరుగులు సాధించి ‘ఉత్తమ బ్యాట్స్‌మన్’ అవార్డు గెలుచుకున్నాడు. సెలవులపై స్వస్థలానికి వచ్చిన అశ్విన్ కు నగరంలోని హాట్‌స్పాట్ క్రికెట్ గ్రౌండ్‌లో ఘనంగా సత్కారం జరిగింది.
2017 నుంచి 2021 వరకు నోబుల్ క్రికెట్ క్లబ్‌కు కెపె్టన్‌గా వ్యవహరిస్తూ క్రమశిక్షణ, ఫిట్‌నెస్, నాయకత్వ లక్షణాలను తన లైఫ్ స్టైల్‌లో భాగం చేసుకున్నానని సూరజ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని ఏ–డివిజన్ వన్డే లీగ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశి్వన్, అనంతరం సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ క్రికెట్ అసోసియేషన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. సూరజ్ ఎప్పుడూ ఆటలో ప్రతిభ చూపుతూ ముందుంటూ నాయకత్వం వహిస్తాడని మెంటార్ డా.ఫహీమ్ ఉద్దిన్ ఖాజా తెలిపారు.



