WTA Finals: వరల్డ్‌ నంబర్‌ వన్‌కు షాక్‌ 

Jessica Pegula Upsets World No 1 Aryna Sabalenka In WTA Finals - Sakshi

మహిళల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌)కు రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. మెక్సికోలోని కాన్‌కున్‌ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా ప్లేయర్‌ జెస్సికా పెగూలా 6–4, 6–3తో సబలెంకాను ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

88 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పెగూలా ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు సబలెంకా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. సబలెంకా, రిబాకినా (కజకిస్తాన్‌) మధ్య జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన ప్లేయర్‌కు రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ లభిస్తుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top