Jeremy Lalrinnunga Won Gold Medal Weight Lifting Championship - Sakshi
Sakshi News home page

Jeremy Lalrinnunga: భారత వెయిట్‌లిఫ్టర్‌ జెరెమీకి స్వర్ణం 

Dec 11 2021 9:48 AM | Updated on Dec 11 2021 10:20 AM

Jeremy Lalrinnunga Won Gold Medal Weight Lifting Championship - Sakshi

కామన్వెల్త్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత యువ లిఫ్టర్‌ జెరెమీ లాల్‌రినుంగా స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాష్కెంట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో మిజోరం రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల జెరెమీ 67 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచాడు. జెరెమీ స్నాచ్‌లో 141 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 164 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 305 కేజీలతో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఇదే వేదికపై జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో జెరెమీ ఏడో స్థానంలో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement