రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ కీలక బౌలర్‌ దూరం

James Anderson Not Playing In Second Test Due To Rotation Policy - Sakshi

చెన్నై: టీమిండియాతో ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ దూరం కానున్నాడు. రొటేషన్‌ పాలసీలో భాగంగా స్టువర్ట్‌ బ్రాడ్‌కు అవకాశమిచ్చేందుకు అండర్సన్‌ను పక్కన పెడుతున్నట్లు ఈసీబీ తెలిపింది. ఈసీబీ రొటేషన్‌ పాలసీని కచ్చితంగా అమలు చేస్తుంది. ఆటగాడు ఎంత మంచి ఫామ్‌లో ఉన్నా సరే అతన్ని పక్కనబెట్టి మరొక ఆటగాడికి చాన్స్‌ ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అండర్సన్‌ను తప్పించి బ్రాడ్‌కు అవకాశం కల్పించనున్నారు.

ఇదే విషయమై ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ క్రిస్‌ సిల్వర్‌ఉడ్‌ స్పందిస్తూ.. అండర్సన్‌ను పక్కనబెట్టడం మాకు ఇష్టం లేదు. . మొదటి టెస్టులో విజయం సాధించిన జట్టుతోనే కొనసాగించాలని మాకు ఉంటుంది. అయితే రొటేషన్‌ పద్దతిలో ఆటగాళ్ల ఎంపిక ఉండడంతో ఈ విషయంలో ఏం చేయలేము. అండర్సన్‌ స్థానంలో రానున్న బ్రాడ్‌ కూడా మంచి ఫామ్‌లో ఉ‍న్నాడు. బ్రాడ్‌తో పాటు మంచి నాణ్యమైన బౌలర్లు ఉండడం మాకు కలిసొచ్చే అంశమే. రొటేషన్‌ పద్దతిలో ఆటగాళ్లకు రెస్ట్‌ ఇవ్వడం వల్ల తర్వాతి మ్యాచ్‌కు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అని చెప్పుకొచ్చాడు. ఇక బ్యాటింగ్‌లో జాస్‌ బట్లర్‌ కూడా రెండో టెస్టుకు దూరమవ్వనున్నాడు. బట్లర్‌ స్థానంలో జానీ బెయిర్‌ స్టో లేదా ఫోక్స్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. లంకతో జరిగిన రెండు టెస్టులతో పాటు టీమిండియాతో జరిగిన తొలి టెస్టు తర్వాత తిరిగి వెళ్లాలని ముందే నిర్ణయమైపోయింది. ఇక అండర్సన్‌ తొలి టెస్టులో ఆట చివరిరోజు అద్భుతంగా బౌలింగ్‌ చేసి గిల్‌, రహానే, పంత్‌ వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. అండర్సన్‌ రెండో ఇ‍న్నింగ్స్‌లో 11-4-17-3తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 
చదవండి: ఆ బెయిల్‌ ఎలా కిందపడింది : ఇషాంత్‌
ఐసీసీపై విరాట్‌ కోహ్లి ఆగ్రహం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top