IPL 2022: 'దీపక్ చాహర్ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అతడికే ఉంది'

Irfan Pathan Names Youngster Who Can Replace - Sakshi

ఐపీఎల్‌-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడనుంది. అయితే సీఎస్కే స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడితో పాటు రుత్‌రాజ్‌ గైక్వాడ్ కూడా ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. సాధరణంగా చాహర్‌ పేస్‌ బౌలర్‌గా జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తాడు.

అయితే అతడు దూరం కావడంతో అతడి స్ధానాన్ని జట్టులో ఎవరు భర్తీ చేస్తారన్నది ప్రశ్నార్ధకమైంది. ఈ నేపథ్యంలో చాహర్‌ స్ధానాన్ని భర్తీ చేసే సత్తా అండర్‌-19 బౌలర్‌ రాజవర్ధన్ హంగర్గేకర్‌కు ఉంది అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయ పడ్డాడు. ఐపీఎల్‌ మెగా వేలంలో హంగర్గేకర్‌ను సీఎస్కే రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక  రాజవర్ధన్ హంగర్గేకర్‌ అండర్‌-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించాడు.

అతడు బంతితో పాటు బ్యాట్‌తో కూడా దుమ్ము దులిపాడు. "దీపక్‌ చాహర్‌ త్వరగా కోలుకోవాలని  సీఎస్కే మేనేజేమెంట్‌ కోరుకుంటుంది. ఒక వేళ అతడు అందుబాటులో లేకుంటే హంగర్గేకర్‌తో ఆ స్ధానాన్ని భర్తీ చేయవచ్చు. అతడు తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టగలడు. అంతేకాకుండా అతడికి సిక్స్‌ హిట్టింగ్‌ చేసే సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి చెన్నై విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.

చదవండి: WTC Final: అటు ఇంగ్లండ్‌.. ఇటు ఆస్ట్రేలియా.. టీమిండియాకు అంత ఈజీ కాదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top