Breadcrumb
Live Updates
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సీఎస్కే లైవ్ అప్డేట్స్
సీఎస్కే ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయం
సీఎస్కే నిర్ధేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 117 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా సీఎస్కే 91 పరుగుల భారీ తేడాతో డీసీపై ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (25) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సీఎస్కే బౌలర్లలో మొయిన్ అలీ 3, సిమ్రన్‌జీత్, ముకేశ్ చౌదరీ, బ్రావో తలో 2 వికెట్లు, తీక్షణ ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రుతరాజ్ గైక్వాడ్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, సిక్స్), శివమ్ దూబే (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధోని (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు) చెలరేగడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఎనిమిదో వికెట్ కోల్పోయిన డీసీ
సిమ్రన్ జీత్ బౌలింగ్‌లో ఉతప్పకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఫలితంగా డీసీ 99 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
13 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ
ఇన్నింగ్స్ 10వ ఓవర్లో మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టగా.. 11వ ఓవర్లో ముకేశ్ చౌదరీ అదే ఫీట్‌ను సాధించాడు. ఈ ఓవర్లో తొలి బంతికి అక్షర్ (1)ను క్లీన్ బౌల్డ్ చేసిన ముకేశ్.. ఐదో బంతికి పావెల్ (3)ను పెవిలియన్‌కు పంపాడు. 11 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 85/7. శార్ధూల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన మొయిన్ అలీ
ఇన్నింగ్స్ 10వ ఓవర్లో మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి బంతికి పంత్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన మొయిన్.. నాలుగో బంతికి రిపల్ పటేల్ (6)ను పెవిలియన్‌కు పంపాడు. 10 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 82/5. రోవ్‌మన్ పావెల్ (2), అక్షర్ పటేల్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
పంత్ క్లీన్ బౌల్డ్
మొయిన్ అలీ బౌలింగ్‌లో వికెట్లు వదిలి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసిన రిషబ్ పంత్ (21) ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
మొయిన్ అలీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్ మార్ష్ (20 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. లాంగ్ ఆన్‌లో రుతురాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. 8 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 73/3. పంత్ (20), రోవ్‌మన్ పావెల్ (1) క్రీజ్‌లో ఉన్నారు.
వార్నర్ భాయ్ ఔట్
మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేసిన డేవిడ్ వార్నర్ (19) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4.2 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 36/2.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ
209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. సిమ్రన్‌జీత్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి శ్రీకర్ భరత్ (8) ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 17/1. క్రీజ్‌లో వార్నర్ (8), మిచెల్ మార్ష్ (1) ఉన్నారు.
డెవాన్ కాన్వే సునామీ ఇన్నింగ్స్.. ఢిల్లీ ముందు కొండంత లక్ష్యం
ఓపెనర్లు డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రుతరాజ్ గైక్వాడ్ (33 బంతుల్లో 41; 4 ఫోర్లు, సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ శివమ్ దూబే (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడటంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో నోర్జే వరుస బంతుల్లో మొయిన్ అలీ (9), ఉతప్ప (0)లను పెవిలియన్‌కు పంపడంతో సీఎస్కే మరింత భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే 3, ఖలీల్ అహ్మద్ 2, మిచెల్ మార్ష్ ఓ వికెట్ పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్కే
ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి రాయుడు (5) ఔటయ్యాడు. ఫలితంగా 187 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే
మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శివమ్ దూబే (32) డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
సెంచరీ మిస్ అయిన కాన్వే
49 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 87 పరుగులు చేసిన అనంతరం ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి డెవాన్ కాన్వే ఔటయ్యాడు. 17 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 170/2. క్రీజ్‌లో శివమ్ దూబే (32), రాయుడు ఉన్నారు.
శతకం దిశగా దూసుకెళ్తున్న కాన్వే
సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే ఐపీఎల్ కెరీర్లో తొలి శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 85 పరుగుల వద్ద కొనసాగుతున్న కాన్వే.. ఐపీఎల్లో తొలి సెంచరీకి 15 పరుగుల దూరంలో ఉన్నాడు. 15 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 148/1. మరో ఎండ్‌లో శివమ్ దూబే (14) ఓ మోస్తరుగా ఆడుతున్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే
సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసిన గైక్వాడ్.. నోర్జే బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాన్వే (64), శివమ్ దూబే క్రీజ్‌లో ఉన్నారు. 11 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 110/0.
కుల్దీప్పై విరుచుకుపడిన కాన్వే
ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే (32 బంతుల్లో 63) విరుచుకుపడ్డాడు. అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో వరుస సిక్సర్లు బాదిన కాన్వే.. కుల్దీప్ వేసిన 8వ ఓవర్లో మరోసారి వరుస సిక్సర్లు బాదాడు.
అనంతరం అక్షర్ వేసిన 9వ ఓవర్లో సింగల్ తీయడం ద్వారా కాన్వే 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో కాన్వేకు ఇది వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరో ఎండ్‌లో రుతురాజ్ (32) సైతం వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. 10 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 100/0.
కాన్వే విజృంభణ
సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే (17 బంతుల్లో 27) చెలరేగి ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదిన కాన్వే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. 5 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 43/0. మరో ఎండ్‌లో రుతురాజ్ (14) కూడా వేగంగా ఆడుతున్నాడు.
ధాటిగా ఆడుతున్న సీఎస్కే
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. రుతురాజ్ (11), కాన్వే (11) సునాయాసంగా పరుగులు రాబడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 24/0
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్ ధోని, డ్వేన్ బ్రావో, సిమ్రన్‌జీత్ సింగ్, మహీశ్ తీక్షణ, ముకేశ్ చౌదరీ
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, రిపల్ పటేల్, రోవమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే
Related News By Category
Related News By Tags
-
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జెమీమా
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఎంపికైంది. భారత జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీ...
-
ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్లు..?
ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్లను మార్చనుందని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఐపీఎల్లో అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్.. డబ్ల్యూపీఎల్‌లో మెగ్ లాన్నింగ్ స్థానంలో జెమీమా...
-
చవక ధరకే బెస్ట్ ప్లేయర్లు.. వేలంలో సూపర్ హిట్!
ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ స్పందించాడు. ఈసారి వేలంపాటలో అందరి కంటే ఢిల్లీ ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. ఎక్కు...
-
మరోసారి ఐపీఎల్లో.. సర్ఫరాజ్ స్పందన ఇదే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎట్టకేలకు తిరిగి అడుగుపెట్టాడు టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 2023లో చివరి సారిగా ఐపీఎల్ ఆడిన ఈ ముంబైకర్.. దాదాపు మూడేళ్ల విరామం త...
-
'డేల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లా'.. ఢిల్లీ జట్టులోకి పేస్ సంచలనం
'శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది' అని అంటుంటారు. ఈ మాట సరిగ్గా జమ్మూ కాశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్కి సరిపోతుంది. ఒకప్పుడు ట్రయల్స్ కోసం తన స్నేహితుడి బూట్లు అడిగి తెచ్చుకున్న ఆకిబ్...


