ఆఫ్ఘనిస్తాన్‌​కు మరో షాకిచ్చిన ఐర్లాండ్‌.. వరుసగా రెండో విజయం! | Ireland Beat Afghanistan In The Second T20I By 5 wickets | Sakshi
Sakshi News home page

AFG vs IRE: ఆఫ్ఘనిస్తాన్‌​కు మరో షాకిచ్చిన ఐర్లాండ్‌.. వరుసగా రెండో విజయం!

Aug 12 2022 8:57 AM | Updated on Aug 12 2022 8:57 AM

Ireland Beat Afghanistan In The Second T20I By 5 wickets - Sakshi

బెల్‌ఫాస్ట్‌ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఐర్లాండ్‌ అధిక్యంలో నిలిచింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (36) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఐరీష్‌ బౌలర్లలో జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 123 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌..19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐర్లాండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ఆండీ బల్బిర్నీ 46 పరుగులతో రాణించగా, అఖరిలో డాకెరల్‌ 25 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో కెప్టెన్‌ నబీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ముజీబ్‌ తలా వికెట్‌ సాధించారు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఐర్లాండ్‌ బౌలర్‌ జోష్ లిటిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు వరిచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టీ20 బెల్‌ఫాస్ట్‌ వేదికగా శుక్రవారం జరగనుంది.
చదవండిIND vs ZIM: 6 ఏళ్ల తర్వాత భారత్‌తో సిరీస్‌.. జట్టును ప్రకటించిన జింబాబ్వే! కెప్టెన్‌ దూరం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement