ఐపీఎల్ 2022: గతేడాది మిస్‌ అయ్యింది, ఈసారి తగ్గేదేలే.. కేకేఆర్‌ పూర్తి జట్టు ఇదే..

IPL Mega Auction 2022: Kolkata Knight Riders Complete Squad - Sakshi

రెండు రోజుల పాటు(ఫిబ్రవరి 12, 13) ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఆచితూచి వ్యవహరించింది. తమకు కావల్సిన ఆటగాళ్ల కోసం పోటీపడుతూనే, అవసరానికి తగ్గట్టుగా పర్స్‌ మేనేజ్మెంట్‌ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. పాట్‌ కమిన్స్‌(7.25 కోట్లు), శ్రేయస్‌ అయ్యర్ (12.25 కోట్లు), నితీశ్‌ రాణా (8 కోట్లు), శివమ్‌ మావి (7.25 కోట్లు) లాంటి ఆటగాళ్ల కోసం ఎంతైనా తగ్గేదేలే అన్నట్లు కనిపించిన కేకేఆర్.. టీమిండియా టెస్ట్‌ ఆటగాడు ఆజింక్య రహానేపై అనూహ్యంగా కోటి రూపాయలు ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది.

వేలానికి ముందే 34 కోట్లు పెట్టి ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు), వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు), వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు), సునీల్‌ నరైన్‌ (6 కోట్లు)లను రీటైన్‌ చేసుకున్న కేకేఆర్‌.. మెగా వేలంలో 45 కోట్లు ఖర్చు చేసి 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2021 సీజన్‌లో అనూహ్య విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన కేకేఆర్‌ ఈ సారి పక్కా ప్రణాళిక ప్రకారం జట్టును ఎంచుకుని మరో టైటిల్‌ తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. వేలంలో భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న టీమిండియా ప్లేయర్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కేకేఆర్‌ సారధ్య బాధ్యతలు అ‍ప్పజెప్పే అవకాశం ఉంది. 2022 ఐపీఎల్‌ ఫైట్‌లో తలపడబోయే కేకేఆర్‌ పూర్తి జాబితా ఇదే..

రిటైన్డ్‌ ఆటగాళ్లు: 

  • ఆండ్రీ రసెల్‌ (12 కోట్లు)
  • వరుణ్‌ చక్రవర్తి (8 కోట్లు)
  • వెంకటేశ్‌ అయ్యర్‌ (8 కోట్లు) 
  • సునీల్‌ నరైన్‌ (6 కోట్లు)

మెగా వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: 

  • శ్రేయస్‌ అయ్యర్‌ (12.25 కోట్లు)
  • నితీశ్‌ రాణా (8 కోట్లు)
  • పాట్‌ కమిన్స్‌ (7.25 కోట్లు)
  • శివమ్‌ మావి (7.25 కోట్లు)
  • సామ్‌ బిల్లింగ్స్‌ (2 కోట్లు)
  • ఉమేశ్‌ యాదవ్‌ (2 కోట్లు)
  • అలెక్స్‌ హేల్స్‌ (1.5 కోట్లు)
  • అజింక్య రహానే (కోటి)
  • మహ్మద్‌ నబీ ( కోటి)
  • షెల్డన్‌ జాక్సన్‌ (60 లక్షలు)
  • అశోక్‌ శర్మ (55 లక్షలు)
  • అభిజీత్‌ తోమర్‌ (40 లక్షలు)
  • రింకు సింగ్‌ (20 లక్షలు)
  • అంకుల్‌ రాయ్‌ (20 లక్షలు)
  • రసిక్‌ దార్‌ (20 లక్షలు)
  • బి ఇంద్రజిత్‌ (20 లక్షలు)
  • ప్రీతమ్‌ సింగ్‌ (20 లక్షలు)
  • రమేశ్‌ కుమార్‌ (20 లక్షలు)
  • అమాన్‌ ఖాన్‌ (2 లక్షలు)

    చదవండి: ఐపీఎల్ 2022: ఆరెంజ్‌ ఆర్మీ ఇదే.. ఈసారి దబిడి దిబిడే..!
     
Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top