IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన రమణ్‌దీప్‌ సింగ్‌ | IPL 2024, KKR vs LSG: Ramandeep Singh Takes Super Flying Catch Of Deepak Hooda | Sakshi
Sakshi News home page

IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన రమణ్‌దీప్‌ సింగ్‌

Apr 14 2024 4:47 PM | Updated on Apr 14 2024 4:56 PM

IPL 2024 KKR VS LSG: Ramandeep Singh Takes Super Flying Catch Of Deepak Hooda - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 14) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు రమణ్‌దీప్‌ సింగ్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడా (8) కొట్టిన షాట్‌ను రమణ్‌దీప్‌ డైవ్‌ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

కాగా, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్‌ (10), కేఎల్‌ రాహుల్‌ (39), దీపక్‌ హుడా (8), స్టోయినిస్‌ (10) ఔట్‌ కాగా.. బదోని (27), పూరన్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. స్టార్క్‌, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి, ఆండ్రీ రసెల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ప్రస్తుత సీజన్‌లో లక్నో హ్యాట్రిక్‌ విజయాలు సాధించి (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్‌ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్‌ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో‌ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి.

కేకేఆర్‌ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్‌ టు హెడ్‌ ఫైట్‌ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement