IPL 2024 GT VS DC: అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టిన పంత్‌ | IPL 2024 GT VS DC: Rishabh Pant Takes Stunning Catch Of David Miller | Sakshi
Sakshi News home page

IPL 2024 GT VS DC: అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టిన పంత్‌

Apr 17 2024 8:29 PM | Updated on Apr 17 2024 8:32 PM

IPL 2024 GT VS DC: Rishabh Pant Takes Stunning Catch Of David Miller - Sakshi

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగింది. ఇషాంత్‌ శర్మ (2-0-8-2), ముకేశ్‌ కుమార్‌ (2-0-13-1) నిప్పులు చెరిగే బంతులతో విజృంభించగా.. సుమిత్‌ కుమార్‌ అద్భుతమైన త్రోతో సాయి​ సుదర్శన్‌ను రనౌట్‌ చేశాడు. ఫలితంగా గుజరాత్‌ 5 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. 

పంత్‌ సూపర్‌ క్యాచ్‌..
ఢిల్లీ క్యాపిటల్స్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ చాలాకాలం తర్వాత అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుత ఐపీఎల్‌తో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. మునుపటి తరహాలో వికెట్ల వెనక చురుగ్గా ఉండి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ పట్టుకున్నాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో లెగ్‌ సైడ్‌ దిశగా డేవిడ్‌ మిల్లర్‌ ఆడిన షాట్‌ను పంత్‌ అద్భుతమైన డైవిండ్‌ క్యాచ్‌గా మలిచి అభిమానుల మన్ననలు పొందాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో వైరలవుతుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ 47 పరుగుల వద్ద మరో (ఐదో) వికెట్‌ కోల్పోయింది. ట్రిస్టన్‌ స్టబ్స్‌ బౌలింగ్‌లో రిషబ్‌ పంత్‌ అద్భుతమైన స్టంపింగ్‌ చేయడంతో అభినవ్‌ మనోహర్‌ (8) ఔటయ్యాడు. 8.3 ఓవర్ల అనంతరం గుజరాత్‌ స్కోర్‌ 47/5గా ఉంది. రాహుల్‌ తెవాటియా (7), రషీద్‌ ఖాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. సాహా  (2), గిల్‌ (8), సాయి సుదర్శన్‌ (12), డేవిడ్‌ మిల్లర్‌ (2), అభినవ్‌ మనోహర్‌ (8) ఔటయ్యారు. ఇషాంత్‌ శర్మ 2, ముకేశ్‌ కుమార్‌, స్టబ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement